శ్రీ వయ్యా సామేల్ గారి 'పాటల తోట ' పుస్తకావిష్కరణం కుత్బుల్లాపుర్ లోని నాగార్జున హై స్కూల్ లో ఉ.11-00 గం.కు జరగనుంది. శ్రీ సామేల్ గత పది సం.గా సిటీ అరసం సభ్యుడు గా ఉన్నారు. ఇప్పటికే పదిహేను కవితా సంపుటులను వెలికి తెచ్చారు. పేద ప్రజల పక్షపాతిగా సామజిక కార్యకర్తగా ఆయన తన పుస్తక రచన చేయటం అంతా తెలిసిందే. పెద్దగా చదువుకోలేదు గానీ సమాజాన్ని బాగా చదివారు. ఎటూ ప్రీ లాంసింగ్ గాబట్టి దేనికీ వెరవాల్సిన పనిలేక సమాజంలోని కుళ్ళుని తన కలంతో బలంగా కుళ్ళబొడిచారనేది కొన్ని పుస్తకాలు చదివిన నాకు కూడా అర్ధమయింది. దాదాపు ఆయన అన్ని పుస్తకాలకీ ముఖపత్రం వేసిన వర్చూ దీనికి కూడా పై విధంగా ముఖపత్రం సామేల్ కి గీసిచ్చారు. ఇంటిల్లిపాదీ జ్వరాలు కాబట్టి పిలుపు వచ్చినా హాజరవలేక పోతున్నాం. ఆల్ ది బెస్ట్ సామేల్జీ!!!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి