1, నవంబర్ 2014, శనివారం

“నా దృష్టిలో తెలంగాణా కాలే పెనం నుంచి పొయ్యిలో పడ్డది. అందుకు విప్లవ నిర్మాణాలూ, వారి అవగాహనా, కవిత్వం, కళల చుట్టూ పనిచేసినవారు ప్రధాన బాధ్యత వహించాల్సి ఉంటుంది”అంటున్నారు ప్రొ:కంచ ఐలయ్య

“నా దృష్టిలో తెలంగాణా కాలే పెనం నుంచి పొయ్యిలో పడ్డది. అందుకు విప్లవ నిర్మాణాలూ, వారి అవగాహనా, కవిత్వం, కళల చుట్టూ పనిచేసినవారు ప్రధాన బాధ్యత వహించాల్సి ఉంటుంది”అంటున్నారు  ప్రొ:కంచ ఐలయ్య నేటి ఆంధ్ర జ్యోతిలో (dt.1.11.2014). ఆంధ్ర జ్యోతి దినపత్రిక dt.1.11.14 సౌజన్యం తో... ఇక్కడ చదవచ్చుకవిత్వం, కళల చుట్టూ పనిచేసినవారు ప్రధాన బాధ్యత తీసుకుని, అసలా బాధ్యత ఏంటి, ఎలా వచించారు, అసలు వచిన్చారా లేదా , ఎంతవరకూ, అన్న విషయంలో  స్పందించాల్సిన బాధ్యత ఉంది. వేచి చూద్దామా?

16, జూన్ 2014, సోమవారం

కాశీ పట్నం చూడర బాబూ....!

ఆ మధ్య అనుకోకుండా కాశీ పుణ్య క్షేత్రం దర్శించుకోగలగడం అదృష్టంగా భావిస్తున్నాను. అందునా,  సార్వత్రిక ఎన్నికల ఆఖరి ఘట్టం గా జరిగిన ( మోడీ వర్సెస్  కేజ్రీవాల్ -  నియోజక వర్గం అయిన )  వారణాసి లో ఎన్నికల రణరంగపు రోజు అయిన 13.05.2014 న అక్కడ ఉండటం అదో ఉత్కంట!   నిజానికి కాశీ వెళ్లేముందు ఎంతో తెలుసుకుని వెళ్ళాలనుకుని - 'భారతదేశ తీర్ధయాత్రలు' అనో 'దర్శనీయ  పుణ్యక్షేత్ర ములు' అనో ఉన్న చాలా పుస్తకాలు కొని చదివినవి కొద్దిగా సహాయపడగలిగినా, అనేకానేక వెబ్ సైట్లు మాత్రం ఆదరాబాదర అందించిన అసంపూర్తి తో కూడిన సమాచారమే ఉంది. స్వాతంత్ర్యానికి ముందెప్పుడో వ్రాసిన "ఏనుగు వీరాస్వామి" వారి కాశీ దర్శనం పుస్తకం pdf డవున్ లోడ్ చేసుకోగలిగినా, అందులోని  వందలాది పేజీల సమాచారం గ్రహించడం, అదీ శుద్ధ గ్రాంధికం లోనూ, అప్పటి కష్టతర  ప్రింటింగ్ లో ఉండటంతోనూ -  ఆ కొద్ది సమయం లో కుదరలేదు.అయితే తిరిగి వచ్చాక కూడలి లో చక్కటి బ్లాగ్ దొరికింది. అదే ఇది! కాశీ, దాని చుట్టు ముట్టు  దర్శనీయ స్థలాల గురించి అద్భుతమైన బ్లాగ్ ముంగిలి. బ్లాగరి లక్ష్మి గారికి వందనాలు. త్వరలో,  నా కెమెరా కన్ను తో చూసిన కొన్ని చిత్రాలని కూడా పోస్టు చేస్తాను.