24, నవంబర్ 2012, శనివారం

FREE BIRD-స్వేఛ్చా విహంగం....: ఎవడు యాగం చేస్తే దిమ్మదిరిగి మైండ్ బ్లాకై చీలిపోద్దో......

FREE BIRD-స్వేఛ్చా విహంగం....: ఎవడు యాగం చేస్తే దిమ్మదిరిగి మైండ్ బ్లాకై చీలిపోద్దో......
www.bsssindia.org

25, ఏప్రిల్ 2012, బుధవారం

కార్పొ’రేట్ల’ చదువుల గురించి ఇదివరకే నే బ్లాగిన వైనం


కార్పొ’రేట్ల’ చదువుల గురించి ఇదివరకే నే బ్లాగిన వైనం ఇప్పుడీ ఇంటర్ ఫలితాల వెల్లడి తర్వాత చిక్కనైందనిపిస్తుంది. సదరు పోస్టింగ్ మళ్ళీ ఇక్కడ రి-పోస్ట్ చేయకుండా వుండలేక పోతున్నాను. అది చదివితే ఇప్పటి రిసల్ట్స్...సిలబస్...యాజమాన్యపు లొసుగులు....పేరెంట్స్ పట్టించుకోని తనం....చదువుల డొల్లతనం....కాసుల గల గల ....విద్యార్థుల విల విల.....భావి పౌరులని ఏ రీతిలో యాజమాన్యాలు  తప్పుగా మలుస్తున్నాయి...అసలు చదువేం చెబుతున్నారు....పిలకాయలేం నేర్చుకుంటున్నారు....మొత్తంగా...విద్యను ఎట్లా భ్రష్టు పట్టిస్తున్నారు....పేదల కెలా దూరం చేస్తున్నారు....లాటి ఒక భవిష్యత్ చిత్రానికి రోడ్ మేప్ పరుస్తుందని నేను భావిస్తున్నాను. పనిలో పనిగా వర్చు కార్టూన్ కూడా ఒకటి అప్లోడ్ చేస్తున్నాను!


13, ఫిబ్రవరి 2012, సోమవారం

ఈ పండగలోని కృతక ’లవ్’ని కాక లలితమైన ’లబ్-డబ్’ని చూపించింది.

గ్లోబలైజేషన్ పుణ్యమా అని "వలంటైన్స్ డే" అనొక "దినాన్ని" దిగుమతి చేసుకుని ’సద్వినియోగం’చేసుకోవడం ఓ దశాబ్దంగా నడుస్తోందనిపిస్తుంది.  కోలవెర్రి లా దిగుమతి చేస్కున్న ప్రతిదీ వాణిజ్యమార్గపు బాట పట్టడంలో మన మార్కెట్టు మహా దిట్ట! ఓ పక్క అబ్బబ్బా!ఇద్దూ...అనే అబ్బాయిలతో-ఉండవద్దా హద్దూ పొద్దూ అనే ముద్దుగుమ్మలతోనూ వలపు వనాలలో కిలకిల రవాలు పరాకాష్టకు చేరగా- తాళి కట్టు శుభవేళా....అంటూ భాజాపాయంగార్లు పెళ్ళి బాజాల గోలలతో సదరు కుర్రకారు విలవిలలాడేలా చేయగా.... రకరకాల భావావేశాలకు లోనైన ఈ ’డే’ కాంసెప్టు అనేకానేక స్టెప్పులు దాటి...అదేదో అనిర్వచనీయ పదార్ధంగానూ-పండగ చేసుకోవాలో వద్దో తెలియని ’జడ’ పదార్ధంగానూ-చాందసులకే హృదికే అందని మందారంగానూ-చివరాఖరికి అందరి దరికీ చేరిన సుందర పదార్ధంగానూ కాల-చంక్రమణమ్ చేసిన ఈ "వలంటైన్స్ డే" ఇప్పుడు ’ఫర్లేదు...చేసుకోవచ్చు’అని సభ్యసమాజపు చేతులుచాపిన స్వాగత బాహువుల్లోకి చేరింది. పండగలో పస ఎంత ఉన్నా.... పైసలుచేస్కునే మార్కెట్టూ-పైట తొలగితే చెలరేగిపోయే రాకెట్టూ సుసంస్కారాల్ని ఎక్కడో గండి కొట్టేస్తున్నాయి! ఇంకెక్కడో డొల్లతనం కనిపిస్తోంది. ఇలా  ఆలోచనలు సాగుతున్న నా మస్తిష్కాన్ని నిన్నటి ’ఈనాడు’  సంపాదకీయం ప్రేమమయం చేసింది. పండగలో ఎండుతనాన్ని కాక బ్రహ్మాండాన్ని చూపించింది. ఈ పండగలోని కృతక ’లవ్’ని కాక లలితమైన ’లబ్-డబ్’ని చూపించింది. అది ఇదిగో!(ఈనాడు సౌజన్యం తో)

15, జనవరి 2012, ఆదివారం

మన్యంకొండ శ్రీ వేంకటేశ్వర స్వామి

నిన్న 14.01.2012 న మన్యంకొండ శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శన భాగ్యం కలిగింది. రాకాలోకం.బ్లాగ్‌స్పాట్   వారి సౌజన్యం తో...సదరు స్థల పురాణాన్ని ఇక్కడ సంగ్రహించాను! అలాగే కొన్ని నేను తీసిన స్నాప్స్ కూడా ఇక్కడ పొందు పరిచాను.
హైదరాబాద్ తిరిగి వచ్చేస్తూ దారిలో ఉన్న పిల్లల మర్రి కి వెళ్ళి ......