ఆక్టివ్ యుథనేసియా (మెర్సీ కిల్లింగ్ అనబడే బలవన్మరణం) 'తప్పు' గానీ, పాసివ్ యుథనేసియా (చంపీ చంపనట్లున్న లేదా చచ్చీ చావనట్టున్న విధంగా ఆత్మహత్య) 'పర్లేదు' అని తేల్చి పారేసింది సుప్రీం కోర్ట్ ''అరుణా శాన్బాగ్ కేస్'' లో్! ఇది కొందరికి 'శుభం' మరికొందరికి 'భశుం'. తీర్పులు చంపీ చంపనట్టు ఇవ్వటం మహారాజశ్రీ కోర్టు వారికి షరా మామూలే! కానీ ఈ కేసు లో సుప్రీం చాలా సమర్ధవంతమైన తీర్పే ఇచ్చింది. ఏ కోమా దశలో వారికి ఇది 'వరమే'. ఎంచేతంటే కాటికి పర్మిషన్ బంధువులు (?) అడుగుతారు. (వ్యక్తి అడగలేడు గాబట్టి) . కోర్టు 'పరిశీలిస్తుంది' ఫేవరబుల్ గా. లైఫ్ బోర్ దొబ్బో , బతకలేని (ఆర్ధిక) స్తోమత తోనో వ్యక్తే 'ఇంకోటో మరొహటో' కారణం చేత అడుగుతే నో అంటుంది చట్టం. ఎందుకు? ఐ.పీ.సీ. 306(ఆత్మహత్య కు ప్రేరేపణ) మరియు 309(ఆత్మహత్య చర్య) ప్రకారం 'చస్తాను బాబోయ్' అంటె నేరం. ఆణ్ణి శుభ్రంగా బొక్కలో ఏసేయొచ్చు. పైన చెప్పిన తీర్పు తో 'మరింత', 'వ్యక్తిగత', 'జటిల' 'మరణ కారణాలుంటే' తప్ప చావుకు 'క్లీన్ చిట్' ఇవ్వదు చట్టం. మనలో మాట-ఉద్యమాల పేర్లు చెప్పి కొందరు నాయకమ్మన్యులు ఫొటొ కోసం కిరసిన్ సీసా గుమ్మరించుకుంటున్నట్టో ట్యాంకు బండ లో కాసేపు సరదాగా బోటింగు సేసేసి ఆనక దూకి సస్తాననో కూస్తే ఐ.పీ.సీ. 309 లు ఆకర్షించబడవా?
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి