30, మే 2011, సోమవారం

ఇంద్రగంటి జానకీబాల గారి అద్భుత శైలిలో సాగిన ’కనిపించే గతం’

  • పాత పుస్తకాలూ, దినపత్రికలూ లాటివి కొన్ని పేపరువాడికి అమ్మేస్తుంటే - ఎప్పుడో ’వార్త’ డైలీలో సీరియల్ తాలూకు భద్రపరచబడ్డ క్లిప్పింగ్స్ బయట పడ్డాయి.
  • 28.8.2000(సోమవారం) ’వార్త" దినపత్రికలో మొదలైన ఆ డైలీ సీరియల్ (ఓ 42 రోజులు  వచ్చిందనుకుంటా-నాకు 42 క్లిప్పింగ్సే దొరికాయి.)  పేరు "కనిపించే గతం". రచయిత్రి - ఇంద్రగంటి జానకీబాల.
  • రచయిత్రి పరిచయంలో...ఆవిడ నాలుగు కధా సంపుటాలూ, తొమ్మిది నవలలూ, ఒక కవితాసంపుటీ వెలువరించారని ఉంది. వీటిల్లో ఏ ఒక్కటీ చదవకపోవడంచేత ఇదైనా చదువుదామని కూర్చున్నాం గత వారాంతపు ’తీరుబాటులో’.
  • ప్రధమ పురుషలో సాగే సీరియల్....జాతిపిత బాపూజీ మరణించిన రోజుకి మూడేళ్ళ వయసు చిన్నారి ’దేవకి’తన బాల్యం నేపద్యంతో రాసుకున్న నవల. తన బాల్యపు 'నిరుపేద బ్రాహ్మణ' జీవన విధాన రీతి....భీతి......ఇంకా ఆ రోజుల్లోని చిరు ఆనందాలూ, ఆడంబరాలూ, ఆర్భాటాలూ, అచ్చట్లూ, ముచ్చట్లూ, ఖేదన రోదనలూ...వగైరాలతో......సాదా సీదా శైలిగా కనిపిస్తూనే.....అనితరసాధ్యపు శైలిలో తీర్చిదిద్దారు రచయిత్రి. ప్రధమ పురుష వాడడం, వాస్తవికతా చిత్రీకరణ .... వీటితో ’ఆత్మకధేమో’ అనిపిస్తుంది. కావచ్చు-కాకపోవచ్చు. అయితే- ’ఆత్మకధ’ కాకపోయుంటే ఇంత గొప్పగా రాయలేరు సుమా -అనిపిస్తుందా కధాసరళి.  
  • అప్పట్లో...కాసిని కాఫీ నీళ్ళు పొయ్యిమీద ’పడేయడం’.....కుంపటి రాజేసి....పొగ గొట్టంతో ఊదటం....అరుగుమీద కూర్చుని పనీపాటా లేక కూని రాగాలు తీసే ఇర్రెస్పాంసిబుల్ తండ్రి.....నెలకి నలభై రూపాయల జీతంగల టీచరమ్మ.....పిల్లాజల్లా తో జట్కా బండిలో కాకరపర్రు ప్రయాణం.....ఇలా ఎన్నో ఈతరంవాళ్ళకి తెలీని ముచ్చట్లతో....అద్భుత శైలీ గమనంతో చదువరులనాకట్టుకుంటుందీ నవల. దీనికి తప్పకుండా పుస్తక రూపం వచ్చుంటుంది కాబట్టి.....దొరికితే తప్పకుండా పుస్తకప్రియులు చదవాల్సిన పుస్తకం!

26, మే 2011, గురువారం

బూతులు రాస్తే మార్కులు వేస్తారేమో....!!

  • మా పాపవి ఫస్ట్ ఇంటరు ఇంగ్లీషు మార్కులు 95-98 మధ్య  ఎక్స్పెక్ట్ చేస్తే 84 వచ్చాయి. ఎందుకు తగ్గాయో....రైటింగ్ బాలేదా...ప్రశ్నలు వదిలేసిందా...  అని ....రూ.600/- కట్టి రి-వెరిఫికేషన్చేయించాను.ఇలా సమాధానం వచ్చింది.

దీంతోనే  వాళ్ళు బదులుగా     ఆన్సర్ షీట్ 'నకలు' పంపించారు. (ఒక పేపరుకు అంత కట్టించుకుని -రీ-కౌంటింగ్, రీ-వెరిఫికేషన్ మాత్రమే చేస్తారుట. ’రీ-వాల్యూ’ చేయరట.)
  • సరే...తర్వాత ఆన్సర్ షీట్ చూస్తే తెలిసింది.  ముత్యాల్లా రాసింది అన్ని పేజీలూ.  అన్ని చోట్లా 'కరెక్ట్' టిక్ మార్క్స్ పెట్టి ఉన్నాయి. ఒక చోట 'రౌండు' పెట్టాడు . రెండు బిట్లు (  1/2+1/2 =1 mark) తప్ప అన్నీ కరెక్ట్ గా ఉన్నాయి. కానీ అన్నింటిలోనూ ఇష్టారాజ్యంగా తగ్గించుకుంటూ మార్కులు వేయడం వల్ల అలా తగ్గయని తెలిసింది.  ఆ 'రౌండు' పెట్టిన పేజీ ఇలా ఉంది.......


   సెక్షన్ A లో క్వశ్చన్ b లో అన్నొటేషన్ రాయాలి. నాలుగు మార్కులన్న మాట. ఆ ‘Banglore’ లో స్పెల్లింగ్ తప్పయిందట. టెక్స్ట్ బుక్ లో 'Bangalore' అనుందట. ఓ మార్కు 'కట్'. చక్కగా ఆన్సర్ చేస్తే ఇలా ఉంటాయి. అసలు ‘Banglore’ నౌన్ అయినప్పుడు ఎలా రాస్తే యేం!  Hydrabad అనున్నా Hyderabad అనున్నా నౌన్ లో మార్క్స్ కట్ చేయరు. చెయగూడదు.వాళ్ళ టీచర్ కి చూపిస్తే ‘దీనికి...... నేనైతే  93 మార్క్స్ వేస్తానమ్మాయ్’అందట.
  •     ఇంతకీ .......బండ బూతులు రాస్తే .....'సగం' మార్కులేస్తారు. చక్కగా రాసినా మరో మార్కు ఎక్కువేస్తారు. అంతే.....సో......పిల్లకాయ్‌లూ.... అనుకున్నదానికన్నా కొన్ని మార్కులు తగ్గాయని మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ తగ్గించుకోకండి. మందుకొట్టి వాల్యూ చేశేవాళ్ళూ ఉంటారు. డోంట్ గెట్ డిసప్పాయింటెడ్!

22, మే 2011, ఆదివారం

రచనాజ్వాలలతో చమక్కుమంటున్న ’బ్లాగుబావుటాల ’కి జేజేలు!!

  •     బ్లాగుల్లో ’కవిత్వం’- ఆ మాటకొస్తే ఏ  ’సాహితీ వ్యాసంగమైనా’  తామరతంపరగా విస్తరించడానికి కారణం "ప్రచురణా వేగం"! నత్తనడక టపాలు (స్నైల్ మెయిల్) రోజుల్లో ఓ స్టాంపు లేదా బ్రాండ్ పడినవాడు రాస్తేనే ’కవిత్వం’పత్రికాధిపతులకి! మరోడు రాస్తే ’కపిత్వం’!! బుట్ట దాఖలు. వెలుగు చూసిందే కవిత్వం. ఇంక ఎవడు రాసి ట్రంకు పెట్టెలో పెట్టుకుంటాడు ఏ సినిసిస్టో, రీసర్చి స్కాల్రో తప్ప. గతం గతః
        బ్లాగ"రిస్టుల" అంతర్జాలమధనాలలో, జాలాఘాతాలలో ’పత్రికాగ్రేసరుల’కత్తెరలు తుత్తినియలయ్యాయి. చిత్తుబుట్టలు అటకలెక్కాయి. సదరు సంపాదకులు ’కంటెంట్’ సంపాదనకు - సామాన్య రచయితలకై అసామాన్యరీతిలో శోధనావేశం చూపిస్తున్నారు! రచనా సృష్టికి పుష్టికి ’ఆర్భాట శూరత్వం’కానీ ’పీయార్’టాలంటులు కానీ పడికట్టు రాళ్ళు కావనీ ’సృజనాత్మక వైచిత్రే’ముఖ్యలక్షణమనీ గుర్తెరిగి బ్లాగ్లోకానికి మల్లెపూదండ వేస్తున్నారు. కొత్త కొత్త రచయితలని వీళ్ళేమాత్రం అడ్డుకోలేక పోయారు. శవ రచనలకి పూజలు మానుకోవాల్సొచ్చింది. కొత్తబంగారు లోకం వీరి చెత్తబుట్టల్ని తిరిగి వారి చెత్తబుర్రల్లోకే నెట్టింది.  అయితే ’స్నైల్ మెయిల్’ పోయి ’ఈ మెయిల్’ ఎక్కాల్సిన "ప్రచురణార్ధం పంపించే రచనలు" ఇంకా తపాలా ద్వారా పంపించే ఖర్మ రచయితలకెందుకో అర్ధం కావటంలేదు. ఆ తపాలా మూటల్ని తపోవనంలో మగ్గపెట్టబడి ఆనక ఎప్పుడు ఆవిష్కృతమౌతాయో తెలీని పరిస్థితి.
  •     పత్రికల సంగతి ఇలాఉంటే కొన్ని ’సాహితీ పీఠాలో’ ’కవితా సమితులో ’ ’కల్చరల్ ట్రస్టులో’ మరోటో - కవిత్వం పంపుకో- దాంతో వంద రూపాయలు (జోకేంటంటే - దాంతో సరిపడేన్ని పోస్టల్ స్టాంపుతో సహా) వదిలించుకో - ఏళ్ళూ పూళ్ళు ఎదురుచూస్కో - రిప్లయి రాకపోతే మూస్కో) తరహాలో రెచ్చిపోవడం - ఓ బిజినెస్స్ అందామా! ఆఖరికి ఏ గుడి వెనకాలో మునిసిపాలిటీ మార్కెట్ మూలనో ఓ ’టేబుల్ సభ’ పెట్టి నోబుల్ గా క్రతువు ముగించేయడం ఎవరికి తెలీదు? ఆ టక్కులమారి ట్రస్టేశ్వర్రావులు మాత్రం కాలగమనంలో ’సాహితీ సామ్రాట్’ ’సభా విరాట్’ వగైరా బిరుదాంకితులై అలరారుతూంటారు. అది వేరే సంగతి.
  •     ఈ సాహితీ ముష్కరత్వానికి పిండప్రదానం చేసి  రచనాజ్వాలలతో చమక్కుమంటున్న ’బ్లాగుబావుటాల ’కి జేజేలు పలుకుతున్నా.....అంతర్జాల సాహితీ విశ్వంభర కి రెండుచేతులెత్తి నమోవాకాలర్పిస్తున్నా!!

18, మే 2011, బుధవారం

రంభాయూర్వశి లేదనబోకు.

నాయనా స్టీఫెన్ హాకిన్సూ..!
భూమి గుండ్రంగా ఉందనబోకు!!
రంభాయూర్వశి లేదనబోకు.
మరమనిషికీ-మనసుమనిషికీ
మీట నొక్కిన పిమ్మట చిమ్మచీకటేననబోకు.
వందల సిద్ధాంతుల మధ్య కొత్త సిద్ధాంతమిదియేయని
రాధ్ధాంతం చేయకు..!!
మాకు కో అంటే కోటి దేవుళ్ళున్నారు.
వందల కోట్ల సెంటిమెంట్లను
లక్షల కోట్ల వాణిజ్యాల్ని
చల్లగా కాపాడే భావోద్వేగాలనూ
చిల్లర అంశాలతో
చల్లటి వ్యవస్థని చిలకబోకు....!!
 మాకు తెలిదన్నట్టు
కొత్తగా చార్వాకపర్వం విప్పబోకు !!


15, మే 2011, ఆదివారం

పెట్రో కుట్ర








ఎలక్షణాలు అయిపోయి క్షణం కాలేదు!
పాలకుల లక్షణాలు బయట పడ్డాయి.
ఓటరు నెత్తిన పెట్రో కుట్ర బండలు పడ్డాయి!!

'cry'toon-Petrol








Hike of the petrol just after closure of elections to the five states is being viewed so seriously by the populace and also viewed as nothing short of CHEATING the citizens by the UPA Government at the helm of affairs.
            As per reports in hand with Mr.Chandrababu Naidu, the Center hiked 20 times in last 7 years (Rs.33 per lt. hike in all) and 10 times in last 1 year and thus garnered Rs.4000000000000/- in the last 4 years. (Four lack cr.)

10, మే 2011, మంగళవారం

హైట్ ఏంటంటే... ఏది "పరమోత్తమ చుంబనం" ఏది "పరమోత్తమ ఐటం సాంగ్" లాటి "పోటీ"లు పెడుతున్నారు


                                 అనగనగా ఓ ఆస్ట్రేలియన్ సుందరాంగి మోడల్ - తన బికినీ మీద మన హిందూ దేవత లక్శ్మీదేవి బొమ్మ వేసుకు తిరిగిందట. ఇవి అనగనగా ఓ హిందీ డైలీ లో అచ్చైనవిట. హన్నన్నా! ఎటు పోనిస్తున్నాం....!! ఈ తరహా విపరీత చర్యలు లోగడ చాలా చూశాం.చదివాం. ఏ భగరంగ్ దళ్ లెవెల్ గ్రూప్సో డౌన్ డౌన్ అంటం కూడా చదివాం. (ఇది ఏ ఒకళ్ళకో కాక గుడ్ సిటిజన్లందరూ  ఖండించాల్సిన విషయమని  నా భావం)
    హర్షించదగ్గ న్యూసేంటంటే - గౌ"అలహాబాద్ కోర్టు వారు దీన్ని "హిందువుల మతభావజాలాన్ని అవమానించే చర్య" గా పిల్ కింద సుమోటో కేసు గా తీస్కుంది నేడు.  శభాష్! అసలు ఒక మతాన్ననే కాదు- ఏ మతానికైనా ఇలాటి విక్రుత చర్యలు వాంఛనీయమని ఎవరు అనరు. పైగా మహిళా దేవత చిత్రాన్ని మహిళే.....!! రామ రామ!!
ఆ మధ్యన ఓ చానల్లో "ముద్దు" మీద థర్టి మినిట్ ప్రోగ్రాం దుమ్ము దులిపేసింది. "ముద్దు వద్దని" కాదు. "ముద్దు ముచ్చట్లిలా" ఉంటాయని. ఇంకేం "కంటెంట్" తో కుమ్మొచ్చు. తర్వాత మిగతా ఛానల్స్ కూడా నేను సైతం అంటూ ముద్దు స్టోరీలు వండి వార్చాయి. గ్రేట్నెస్ ఏంటంటే...సదరు ప్రోగ్రాంలకి ఫిమేల్ ఆంకర్సే "రసానుభూతి" తప్పకుండా లయవిన్యాసం చేస్తూ ప్రెసెంట్ చేస్తారు. బాంది కదా!! (తర్వాత కొన్నాళ్ళకి బ్రెస్ట్ -  సారీ - బెస్ట్ ఆంఖర్ అని ఏ అభినందన సన్మాన - శాలువా సత్కారం ఇచ్చి గౌరవించుకుంటే మనం చప్పట్లు కొడతాం -  అది వేరే సారి బ్లాగుతాను) పూర్వాశ్రమం లో -  సినిమాల్లో "బూతంతా" చూపించి ఆఖరున "ఇలా" ఉండగూడదబ్బాయ్ అని ముక్తాయించేవాళ్ళు. ఆ రోజులు పోయి టీవీల్లో ఇప్పుడు "బూతంతా" చూపించి నేటి "ట్రెండ్" అని సెలవిస్తున్నారు. మనం "గామోసు" అనుకుంటాం! ఇదేదో ఒక వేవ్ క్రియేట్ చేసి ... వెండి తెర మీద "లిప్ లాక్" ని బాహాటంగా చూపించటం "నేరం" కాదు....అతి సహజం అనే ధోరణి ప్రేక్షక లోకంలో చొప్పించే ధోరణి ఈ మధ్య మీడియాలో కనిపిస్తోంది.  ఈ కోవలోకే వస్తున్నాయ్ ఈ మధ్య కనిపిస్తున్న కొన్ని వార్తా ప్రకటనలు. హైట్ ఏంటంటే... ఏది "పరమోత్తమ చుంబనం" ఏది " పరమోత్తమ ఐటం సాంగ్" లాటి "పోటీ"లు పెడుతున్నారు ఇదిగో ఇలా.....