పిల్లలు పుట్టగానే తలిదండ్రులు- ఏ పేరు పెట్టాలనే 'సంబరం' తో కూడిన 'మీనమేషాల్లో' పడ్తారు. 'నక్షత్ర' యాత్రలు చేస్తారు. 'కుజ' దోషాలన్నా 'భుజ' దోషాలన్నా ఏమైనా ఉన్నాయేమో అని చూస్తారు.మంచి 'పంచాంగానికి' ఓ సలాం పెడ్తారు. ఏ యండకా పేరు చెప్పే యండమూరి వారి పొత్తమో, మల్లా మల్లా చూసి దాచుకునే మల్లాది వారి బుక్కో పట్టుకుని మల్లగుల్లాలు పడ్తుంటారు. అన్నట్టు-వర్చూ కూడా ఓ సారి చేయి చేస్కుని 'నేమ్ యువర్ బేబి '-చిన్నారుల పేర్ల పుస్తకం ' ఓ బుక్కు రాసి 'పారేశాట్ట'. (ప్రింట్ చేసి 'పారేసిన'వారు : కవర్ డిజైనర్ ( శ్రీ రామకృష్ణ కోట్ల) స్వయంగా పూనుకుని వారి తాలూకు ముద్రికా కమ్యూనికేషన్స్, 8-2-293/D/16, Jawahar Colony, Indira Nagar, Jubiliee Hills X Roads, Hyderabad-500 044 వద్ద పబ్లిష్ అయిన జులై, 95 ప్రతి) (కొన్నోడు, ప్రింట్ చేసినోడు, చదివినోడు ఒక్కడూ లేడు గాబట్టి డీటైల్స్ నేను కూడా ఇచ్చి'పారేశాను'.)
సారీ......అసలు విషయమేంటంటే, పైన చెప్పిన 'మీమాంస ' లో పేరెంట్స్ నవ్యాతి నవ్య నామాల్ని శోధించి, ఒడిసి పట్టి ఒకింత 'మోడరన్ నేమ్స్' పెట్టడం పరిపాటయింది. ఇంతవరకూ శభాష్!! తప్పే లేదు. అయితే తపస్వి, యశస్వి, ఉషస్వి, తేజస్వి లాంటి (చివర 'స్వి' వచ్చే ) పేర్ల దగ్గర చిరు జాగ్రత్త తీసుకోమని మనవి. ఉదాహరణకు, అబ్బయి కి 'యశస్వి' అన్నపేరు పెడితే, అమ్మాయి కి 'యశస్విని' అని పెట్టాలి. అంటే చివర 'స్విని' చేరుతుంది. 'తపస్సు ను ఆచరించే వాడు తపస్వి' అయితే, ఆచరించే వనిత 'తపస్విని' అవుతుంది. సో, అమ్మాయిల పేర్లు....తపస్విని, యశస్విని,ఉషస్విని,తేజస్విని, వర్చస్విని .....ఇలా అవుతాయి. అంతేకాని బావున్నాయి కదా అని ఎడాపెడా 'అమ్మాయిలకి' తేజస్వి అనీ యశస్వి అనీ పెట్టకండేం..! ప్లీజ్....! (బ్లాగ్స్ రీచ్ కొంత వరకు వర్కవుట్ అవుతుందని-రీచ్ అయినవారు మరికొందరి కి రీచ్ చేస్తారని ఆశిస్తూ...)
(కాదు..పెట్టచ్చు అనే భాషాశాస్త్రవేత్తలు దయచేసి ఇక్కడ మెయిల్ చెయ్యండేం)

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి