19, జూన్ 2011, ఆదివారం

పిత్రుదేవోభవ

పాట్రియార్కల్ భావజాలమ్ లాటి పదాలు వదిలేస్తే....ఫాదర్స్ డే కూడా ఇప్పుడు సమాజంలో బాగా పండుతోంది. పిత్రుదేవోభవ-కాన్సెప్ట్ పురాణేతిహాసాల్నించీ ఉంది. అదలా ఉంచి ’నాన్న’ని స్మరించుకునే అవకాశం వచ్చింది గాబట్టి- నాన్న కవితాసంకలనం కొని చదవదగ్గదని ఇలా ముఖపత్రాన్ని               చూపిస్తున్నా....                    












 అందులోనే..... పరమపదించిన వర్చూ ’నాన్న’ని  తన  కవితలో చూడచ్చు.























                                                                 

వంటా-వార్పూ


14, జూన్ 2011, మంగళవారం

మనిషి మెదడు చిక్కుతోంది

మనిషి మెదడు చిక్కుతోంది.... ...........  ..............  -కేంబ్రిడ్జ్ శాస్త్రవేత్తలు.(నేటి ఈనాడు)

బహుశా ఇలానేమో 

                                                                

11, జూన్ 2011, శనివారం

తెలంగాణా కి 'అడ్డం'-'నిలువూ'............

కేసీయారే అసలు ’అడ్డంకి’ అని తేల్చిపారేశారు తెదేపా తె.ఫోరం తాండూరు రణభేరిలో.
అసలు ఈ ’అడ్డంకి’ గురించి ఒక్కో పార్టీ ఒక్కో సారి తేల్చిపారేశేసారు వివిధ సందర్భాలలో. ఓవరాల్‌గా ఈ ’అడ్డం’ లేదా ’నిలువు’వివిధ నాయకుల్లో ఎలా జీర్ణించుకుందో ఇలా ఉంటుంది అనిపిస్తుంది. మన విగత ముఖ్య మంత్రి వైయస్సార్ : బాబూ! నేను ’అడ్డమూ’ కాదు ’నిలువూ’ కాదు.
కీసీయార్ : (అప్పట్లో)అసలు వైయస్సారే పెద్ద ’అడ్డం’.(ఇప్పట్లో)సీమాంధ్ర నాయకులే ’అడ్డం’.
బాబు     :అసలు ’అడ్డాలకీ’ ’నిలువుకీ’ మా పూచీ లేదు. కాంగ్రెస్ మాత్రమే దీనికి ’అర్ధం’ చెప్పాలి.(అయితే ’అడ్డం’ ఓ కన్ను-’నిలువు’ ఓ కన్ననీ మాత్రం చెప్పగలం.
నాగం     : అప్పుడు ’అడ్డం’ ఇప్పుడు ’నిలువు’.
సీపీఐ     :ఇడ్లీలో ’అడ్డం’గా ’నిలువైన’చికెన్ ముక్క నంజుకోటం తప్ప నాకు ఇతర అర్ధాలు తెలీవు.
సీపీయం  : అసలు మా వంశమే ’నిలువు’. అప్పుడప్పుడూ పరిస్తితిని బట్టి ’అడ్డం’ తిరగడంలో తప్పులేదు.
హరీష్    :  మా కుటుంబం తప్ప అందరూ ’అడ్డాలే’
జగన్     :అన్నింట్లో మా ’అయ్యే’ ఆదర్శం. ఆయన కల్లో కోచ్చి ఏది చెప్తే అదిచేసి పెడతాం. అయినా పిల్లోణ్ణి పట్టుకు ఇదా అడగడం?
చిరు      :మెగాలుక్ రావాలంటే ’నిలువే’ బెటర్. ’అడ్డమైతే’సినిమాలే బెటర్.
బీజేపీ    :మిగతా రాష్ట్రాల్లో ’నిలువు’గా ఉండి, ఇక్కడ ’అడ్డం’ అని ఎందుకనుకుంటాము. అయితే మీరంతా ’అడ్డం’ తప్పుకోండి, నిలువు’గా పనిచేసి పెడ్తాం. (లేక పోతే ’అడ్డమే’)
డీయస్   : అసలు నాలుక్కే ’అడ్డం’. అయితే అమ్మదయ ఎలా ఉంటే అలా.
బొత్స      : నేను ’నిలువు’గా కనిపిస్తూ ’అడ్డం’గా నరికేస్తా.
సోనియా   : వైయస్ కి డీయస్ ని ’అడ్డం’ పెట్టాను. కిరణ్ కి బొత్స ని ’అడ్డం’ పెట్టాను. ఒకసారి ’నిలువు’కు కమిట్ అయితే మిగతా దేశం అంతా ’అడ్డం’గా నరికేస్తారు ప్రజలు.

9, జూన్ 2011, గురువారం

గీత-గీతి (పెయింటింగ్ మాస్ట్రో ...ఇక 'ఫిదా'ఫిజ్....!!)






నిండైన జీవిన 'చిత్రం'....!
ఆర్టిస్టులూ-అనార్కిస్టులూ
ఇద్దరూ ఫిదాయైన పికాసో పికం...!!
రంగురంగుల ప్రపంచం మాయమై
నల్లగా మిగిలిన శోకం....!
మన హుస్సేన్ అస్తమయం...!!




(నాకు నచ్చిన కామెంట్ ఇక్కడ చదవచ్చు-కృష్ణశ్రీ గారి సౌజన్యం తో)

5, జూన్ 2011, ఆదివారం

మ్యాంగో షో-2011

  • మ్యాంగో షో-2011చాలా పసందుగా జరుగుతోంది ఎగ్సిబిషన్ గ్రౌండ్స్‌లో!


  • దాదాపు రెండు వందల రకాల మామిడి పండ్లతో ప్రదర్శన అపురూపం! అలాటి వాటిలో ఒకటి అతి చిన్న-అతి పెద్ద మామిడి పళ్ళు నన్నాకర్షించాయి.చిన్నది(దేశవాళి)  24 గ్రా.కాగా, పెద్దది (ఏనుగు తొండం) 2.4 కిలోలు. అవి ఇవిగో!
  • పండు పేరు ’ఏనుగుతొండం’ కాగా యాద్రుచ్చికంగా అదే మైదానంలో కొన్ని ’ఏనుగులు’కనిపించాయి. వాటి ముందు మా బబ్లి ఇలా ఫోజిచ్చాడు.
  • మీరూ సరదాగా ఓ లుక్కేస్తారు కదు!