20, మార్చి 2011, ఆదివారం

చందమామ పై కవులు ప్రేమ-సునామీ తో రెచ్చిపోవచ్చు

చందమామ ఎప్పటికీ మామే.
బుల్లి తెరలో-  అశాస్త్రీయ పిల్లులో  భయపెట్టిన 'సూపరు' కాదు గాక కాదు.
కవి కోటికి అతగాడు ఎప్పుడూ 'సూపరే'!
ప్రాణికోటికి చల్లటి కాంతి చుక్కాని చూపరే!!
కురిపిస్తే 'చల్లని' తెల్లని 'లావా' నే-
 నాయకుడనీ అనామికుడనీ తేడా లేక
మన మీద విరుచుకు పడే సుఖమయ  స్నిగ్ధ  'సునామీయే'!
చిరు అలల కామనలు రేపుతాడే గానీ
ధరణీకంపాల దరికి  ఛస్తే  రాడు రాడు
చచ్చు   జోస్యాలని అపహాస్యం చేస్తాడే గాని
దారుణ మారణ హోమం చేతగానే కాదు
పిచ్చి 'మచ్చ' లేని మామగానే జగమేలుతాడు.

(నిన్న (  19-3-2011 )  అందరూ ఊదరగొట్టినట్టు "సూపర్ మూన్" అపకారం చేయలేదు. మరింత అందం గా కనిపించాడు.గత వంద ఏళ్ళ సమాచారాన్ని పరిశీలించినా "సూపర్ మూన్" కీ "ప్రకృతి విపత్తు" కూ సంబంధం  లేదని డిల్లీ  నెహౄ ప్లానటోరియం డైరెక్టర్ ఎన్.రత్నశ్రీ చెప్పారు. భూకంపాలు సునామీ లు భూ అంతర్గత విషయాలని చంద్రుడిని లాగడం పద్దతి కాదని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రొఫిసిక్స్ మాజీ ప్రొ.ఆర్.సీ.కపూర్ కూడా చెప్పారు. ఎటొచ్చీ అసలు విషయం "మన చందమామ" ప్రూవ్ చేశాడు. ఆవిధంగా "జ్యోతిష వేత్త" రిచర్డ్ నోలె ఓడిపోయాడు.)




కామెంట్‌లు లేవు: