13, ఫిబ్రవరి 2012, సోమవారం

ఈ పండగలోని కృతక ’లవ్’ని కాక లలితమైన ’లబ్-డబ్’ని చూపించింది.

గ్లోబలైజేషన్ పుణ్యమా అని "వలంటైన్స్ డే" అనొక "దినాన్ని" దిగుమతి చేసుకుని ’సద్వినియోగం’చేసుకోవడం ఓ దశాబ్దంగా నడుస్తోందనిపిస్తుంది.  కోలవెర్రి లా దిగుమతి చేస్కున్న ప్రతిదీ వాణిజ్యమార్గపు బాట పట్టడంలో మన మార్కెట్టు మహా దిట్ట! ఓ పక్క అబ్బబ్బా!ఇద్దూ...అనే అబ్బాయిలతో-ఉండవద్దా హద్దూ పొద్దూ అనే ముద్దుగుమ్మలతోనూ వలపు వనాలలో కిలకిల రవాలు పరాకాష్టకు చేరగా- తాళి కట్టు శుభవేళా....అంటూ భాజాపాయంగార్లు పెళ్ళి బాజాల గోలలతో సదరు కుర్రకారు విలవిలలాడేలా చేయగా.... రకరకాల భావావేశాలకు లోనైన ఈ ’డే’ కాంసెప్టు అనేకానేక స్టెప్పులు దాటి...అదేదో అనిర్వచనీయ పదార్ధంగానూ-పండగ చేసుకోవాలో వద్దో తెలియని ’జడ’ పదార్ధంగానూ-చాందసులకే హృదికే అందని మందారంగానూ-చివరాఖరికి అందరి దరికీ చేరిన సుందర పదార్ధంగానూ కాల-చంక్రమణమ్ చేసిన ఈ "వలంటైన్స్ డే" ఇప్పుడు ’ఫర్లేదు...చేసుకోవచ్చు’అని సభ్యసమాజపు చేతులుచాపిన స్వాగత బాహువుల్లోకి చేరింది. పండగలో పస ఎంత ఉన్నా.... పైసలుచేస్కునే మార్కెట్టూ-పైట తొలగితే చెలరేగిపోయే రాకెట్టూ సుసంస్కారాల్ని ఎక్కడో గండి కొట్టేస్తున్నాయి! ఇంకెక్కడో డొల్లతనం కనిపిస్తోంది. ఇలా  ఆలోచనలు సాగుతున్న నా మస్తిష్కాన్ని నిన్నటి ’ఈనాడు’  సంపాదకీయం ప్రేమమయం చేసింది. పండగలో ఎండుతనాన్ని కాక బ్రహ్మాండాన్ని చూపించింది. ఈ పండగలోని కృతక ’లవ్’ని కాక లలితమైన ’లబ్-డబ్’ని చూపించింది. అది ఇదిగో!(ఈనాడు సౌజన్యం తో)

6, ఫిబ్రవరి 2012, సోమవారం

అసలు హీరోలు అంటే ఎవరు?

ఒక్కసారి ఇక్కడ క్లిక్ చేద్దురూ!