శ్రీ వయ్యా సామేల్ గారి 'పాటల తోట ' పుస్తకావిష్కరణం కుత్బుల్లాపుర్ లోని నాగార్జున హై స్కూల్ లో ఉ.11-00 గం.కు జరగనుంది. శ్రీ సామేల్ గత పది సం.గా సిటీ అరసం సభ్యుడు గా ఉన్నారు. ఇప్పటికే పదిహేను కవితా సంపుటులను వెలికి తెచ్చారు. పేద ప్రజల పక్షపాతిగా సామజిక కార్యకర్తగా ఆయన తన పుస్తక రచన చేయటం అంతా తెలిసిందే. పెద్దగా చదువుకోలేదు గానీ సమాజాన్ని బాగా చదివారు. ఎటూ ప్రీ లాంసింగ్ గాబట్టి దేనికీ వెరవాల్సిన పనిలేక సమాజంలోని కుళ్ళుని తన కలంతో బలంగా కుళ్ళబొడిచారనేది కొన్ని పుస్తకాలు చదివిన నాకు కూడా అర్ధమయింది. దాదాపు ఆయన అన్ని పుస్తకాలకీ ముఖపత్రం వేసిన వర్చూ దీనికి కూడా పై విధంగా ముఖపత్రం సామేల్ కి గీసిచ్చారు. ఇంటిల్లిపాదీ జ్వరాలు కాబట్టి పిలుపు వచ్చినా హాజరవలేక పోతున్నాం. ఆల్ ది బెస్ట్ సామేల్జీ!!!
27, మార్చి 2011, ఆదివారం
24, మార్చి 2011, గురువారం
ఇదో పెట్టీ ధంధా.....
కారేసుకుని అలా ఓ పుచ్చకాయల ముందు ఆగారనుకోండి.వాడి దగ్గర చాలా చచ్చు పుచ్చువి కొన్ని కుప్ప పెట్టుకుంటాడు. అవి ఓ రెండు మూడు మీ టైర్ల కింద పడేసి నువ్వే పగలకొట్టావ్.పైసలివ్వు అని యాగీ చేస్తాడు.ఇది ఆమధ్య విన్నాను. ఇవ్వాళ నాకే ఓ రైతు బజార్ ముందు గేటు కు అడ్డంగా పెట్టుకుని ద్రాక్షపళ్ళు కొందామని అలా ఆగేనో లేదొ .... ఏమ్మోవ్ .. కారు దిగి చూడు ఎన్ని కాయలు పగలగొట్టావో.....అంటూ చొక్కా మడిచాడు ఇలా....
...వాళ్ళవాళ్ళే చుట్టూతా పోగవుతారు...ఇలా దారిలో ఎందుకు పెట్టారు ....ట్రాపిక్ పోలీస్ పెర్మిషన్ ఉందా లాంటి మన పుచ్చు ప్రశ్నలు అక్కడ వినేవారు ఎవ్వరూ ఉండరు. చచ్చినట్టు ఓ రెండొందలు వదిలించుకుని ఆనక సెల్ లో క్లిక్ చేస్తోంటే రోడ్డు మీద పెట్టిన కాయలని చకచకా ముందుకు తోస్తున్నాడు...ఇలా...
ప్చ్......!!!

20, మార్చి 2011, ఆదివారం
చందమామ పై కవులు ప్రేమ-సునామీ తో రెచ్చిపోవచ్చు
చందమామ ఎప్పటికీ మామే.
బుల్లి తెరలో- అశాస్త్రీయ పిల్లులో భయపెట్టిన 'సూపరు' కాదు గాక కాదు.
కవి కోటికి అతగాడు ఎప్పుడూ 'సూపరే'!
ప్రాణికోటికి చల్లటి కాంతి చుక్కాని చూపరే!!
కురిపిస్తే 'చల్లని' తెల్లని 'లావా' నే-
నాయకుడనీ అనామికుడనీ తేడా లేక
మన మీద విరుచుకు పడే సుఖమయ స్నిగ్ధ 'సునామీయే'!
చిరు అలల కామనలు రేపుతాడే గానీ
ధరణీకంపాల దరికి ఛస్తే రాడు రాడు
చచ్చు జోస్యాలని అపహాస్యం చేస్తాడే గాని
దారుణ మారణ హోమం చేతగానే కాదు
పిచ్చి 'మచ్చ' లేని మామగానే జగమేలుతాడు.
(నిన్న ( 19-3-2011 ) అందరూ ఊదరగొట్టినట్టు "సూపర్ మూన్" అపకారం చేయలేదు. మరింత అందం గా కనిపించాడు.గత వంద ఏళ్ళ సమాచారాన్ని పరిశీలించినా "సూపర్ మూన్" కీ "ప్రకృతి విపత్తు" కూ సంబంధం లేదని డిల్లీ నెహౄ ప్లానటోరియం డైరెక్టర్ ఎన్.రత్నశ్రీ చెప్పారు. భూకంపాలు సునామీ లు భూ అంతర్గత విషయాలని చంద్రుడిని లాగడం పద్దతి కాదని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రొఫిసిక్స్ మాజీ ప్రొ.ఆర్.సీ.కపూర్ కూడా చెప్పారు. ఎటొచ్చీ అసలు విషయం "మన చందమామ" ప్రూవ్ చేశాడు. ఆవిధంగా "జ్యోతిష వేత్త" రిచర్డ్ నోలె ఓడిపోయాడు.)

18, మార్చి 2011, శుక్రవారం
.. ... పాప అయితే 'స్విని', బాబయితే 'స్వి' ... ...
పిల్లలు పుట్టగానే తలిదండ్రులు- ఏ పేరు పెట్టాలనే 'సంబరం' తో కూడిన 'మీనమేషాల్లో' పడ్తారు. 'నక్షత్ర' యాత్రలు చేస్తారు. 'కుజ' దోషాలన్నా 'భుజ' దోషాలన్నా ఏమైనా ఉన్నాయేమో అని చూస్తారు.మంచి 'పంచాంగానికి' ఓ సలాం పెడ్తారు. ఏ యండకా పేరు చెప్పే యండమూరి వారి పొత్తమో, మల్లా మల్లా చూసి దాచుకునే మల్లాది వారి బుక్కో పట్టుకుని మల్లగుల్లాలు పడ్తుంటారు. అన్నట్టు-వర్చూ కూడా ఓ సారి చేయి చేస్కుని 'నేమ్ యువర్ బేబి '-చిన్నారుల పేర్ల పుస్తకం ' ఓ బుక్కు రాసి 'పారేశాట్ట'. (ప్రింట్ చేసి 'పారేసిన'వారు : కవర్ డిజైనర్ ( శ్రీ రామకృష్ణ కోట్ల) స్వయంగా పూనుకుని వారి తాలూకు ముద్రికా కమ్యూనికేషన్స్, 8-2-293/D/16, Jawahar Colony, Indira Nagar, Jubiliee Hills X Roads, Hyderabad-500 044 వద్ద పబ్లిష్ అయిన జులై, 95 ప్రతి) (కొన్నోడు, ప్రింట్ చేసినోడు, చదివినోడు ఒక్కడూ లేడు గాబట్టి డీటైల్స్ నేను కూడా ఇచ్చి'పారేశాను'.)
సారీ......అసలు విషయమేంటంటే, పైన చెప్పిన 'మీమాంస ' లో పేరెంట్స్ నవ్యాతి నవ్య నామాల్ని శోధించి, ఒడిసి పట్టి ఒకింత 'మోడరన్ నేమ్స్' పెట్టడం పరిపాటయింది. ఇంతవరకూ శభాష్!! తప్పే లేదు. అయితే తపస్వి, యశస్వి, ఉషస్వి, తేజస్వి లాంటి (చివర 'స్వి' వచ్చే ) పేర్ల దగ్గర చిరు జాగ్రత్త తీసుకోమని మనవి. ఉదాహరణకు, అబ్బయి కి 'యశస్వి' అన్నపేరు పెడితే, అమ్మాయి కి 'యశస్విని' అని పెట్టాలి. అంటే చివర 'స్విని' చేరుతుంది. 'తపస్సు ను ఆచరించే వాడు తపస్వి' అయితే, ఆచరించే వనిత 'తపస్విని' అవుతుంది. సో, అమ్మాయిల పేర్లు....తపస్విని, యశస్విని,ఉషస్విని,తేజస్విని, వర్చస్విని .....ఇలా అవుతాయి. అంతేకాని బావున్నాయి కదా అని ఎడాపెడా 'అమ్మాయిలకి' తేజస్వి అనీ యశస్వి అనీ పెట్టకండేం..! ప్లీజ్....! (బ్లాగ్స్ రీచ్ కొంత వరకు వర్కవుట్ అవుతుందని-రీచ్ అయినవారు మరికొందరి కి రీచ్ చేస్తారని ఆశిస్తూ...)
(కాదు..పెట్టచ్చు అనే భాషాశాస్త్రవేత్తలు దయచేసి ఇక్కడ మెయిల్ చెయ్యండేం)

16, మార్చి 2011, బుధవారం
సరదాగా బోటింగు సేసేసి ఆనక దూకి సస్తాననో కూస్తే ఐ.పీ.సీ. 309 లు ఆకర్షించబడవా?
ఆక్టివ్ యుథనేసియా (మెర్సీ కిల్లింగ్ అనబడే బలవన్మరణం) 'తప్పు' గానీ, పాసివ్ యుథనేసియా (చంపీ చంపనట్లున్న లేదా చచ్చీ చావనట్టున్న విధంగా ఆత్మహత్య) 'పర్లేదు' అని తేల్చి పారేసింది సుప్రీం కోర్ట్ ''అరుణా శాన్బాగ్ కేస్'' లో్! ఇది కొందరికి 'శుభం' మరికొందరికి 'భశుం'. తీర్పులు చంపీ చంపనట్టు ఇవ్వటం మహారాజశ్రీ కోర్టు వారికి షరా మామూలే! కానీ ఈ కేసు లో సుప్రీం చాలా సమర్ధవంతమైన తీర్పే ఇచ్చింది. ఏ కోమా దశలో వారికి ఇది 'వరమే'. ఎంచేతంటే కాటికి పర్మిషన్ బంధువులు (?) అడుగుతారు. (వ్యక్తి అడగలేడు గాబట్టి) . కోర్టు 'పరిశీలిస్తుంది' ఫేవరబుల్ గా. లైఫ్ బోర్ దొబ్బో , బతకలేని (ఆర్ధిక) స్తోమత తోనో వ్యక్తే 'ఇంకోటో మరొహటో' కారణం చేత అడుగుతే నో అంటుంది చట్టం. ఎందుకు? ఐ.పీ.సీ. 306(ఆత్మహత్య కు ప్రేరేపణ) మరియు 309(ఆత్మహత్య చర్య) ప్రకారం 'చస్తాను బాబోయ్' అంటె నేరం. ఆణ్ణి శుభ్రంగా బొక్కలో ఏసేయొచ్చు. పైన చెప్పిన తీర్పు తో 'మరింత', 'వ్యక్తిగత', 'జటిల' 'మరణ కారణాలుంటే' తప్ప చావుకు 'క్లీన్ చిట్' ఇవ్వదు చట్టం. మనలో మాట-ఉద్యమాల పేర్లు చెప్పి కొందరు నాయకమ్మన్యులు ఫొటొ కోసం కిరసిన్ సీసా గుమ్మరించుకుంటున్నట్టో ట్యాంకు బండ లో కాసేపు సరదాగా బోటింగు సేసేసి ఆనక దూకి సస్తాననో కూస్తే ఐ.పీ.సీ. 309 లు ఆకర్షించబడవా?
15, మార్చి 2011, మంగళవారం
మన 'జీవితానికి' కోటి దండాలు
లేబుళ్లు:
తెలుగు,
స్పూర్తిదాయక చిరు-చిత్రాలు
ఏమి రైట్రో.....యాడి రైట్రో....!!!
పొరపాట్న
ఓ ఓటరు గుడిశ తలుపు
తట్టిన ఓ రాజకీయమ్మన్యుణ్ణి_
తలుపు తీసి ఏమడుగుతాడు?
కూడా?గూడా?గుడ్డా?
ఆ వచ్చిన వాడెవడో ముందు తెలియాలిగా!
"నువ్వు ఏ పార్టీ ?
ఏ స్టేట్ ?
అసెంబ్లా?
పార్లమెంటా ?
కార్పొరేటరా?జడ్పీయా?
గల్లీయా?
ఆంధ్రానా?
తెలంగాణా?
నార్త్ ఆంధ్రానా_సౌథ్ ఆంధ్రానా?
ఈస్ట్ తెలంగాణా_వెస్ట్ తెలంగాణా?
ఆంధ్రాలో అప్పోజీషనా_తెలంగాణా అప్పోజీషనా?
ఆంధ్రా రెబలా_తెలంగాణా రెబలా?
సెట్లర్ బాబువా?
తెలంగాణా సపోర్టింగ్ సెట్లరా_ఆంధ్రా సపోర్టింగ్ సెట్లరా?
లైఫ్ లో సెటిల్ అయిన సెట్లరా?
లైఫ్ లేని సెటిల్ కాని సెట్లరా?
సమైక్యమా అసమైక్యమా?
రీజనల్ కొత్త పార్టీయా?
నాన్ రీజనల్ పాత పార్టీయా?
అండర్ మెర్జరా?
వుడ్ బీ మెర్జరా?
పోయినోడి తాలూకు బతికున్న జండానా?
పోయినోడితోనే పోయిన జండానా?
పోకముందు సీక్రెట్ అజండానా?
పోయింతర్వాత ఓపెన్ జండానా?
ఓపెన్ 'సీక్రెటా?'
సీక్రెట్ 'ఓపెనా?'
ఏ పార్టీ జాకు?
ఏ జాకు చాకు?
........ ..... ......
..... ...... .....
(అన్నట్టు ముగింపు: నిన్న బండు మీద సరికొత్తగా "రైటర్లు"
ప్రతిఘటించారుట. పైన చెప్పిన సాధారణ ఓటరు....సారీ! 'సాధారణ' చదువరి దగ్గరి కి ఓ
'రైటరు' వెళితే సదరు చదువరి పై ప్రశ్నాస్త్రం సంధించక తప్పదు.కంటెంట్ సంగతి తర్వాత.)

13, మార్చి 2011, ఆదివారం
12, మార్చి 2011, శనివారం
Apex court's extraordinary powers u/a.142
Constitution of India:Art.142
The Union judiciary-the Supreme court is enshrined under art.from 124 to 147 under chapter 22.
In ESP Rajaram vs. UOI,2001, the SC held that art.142 has power to pass such decree or make such order as is necessary for doing complete justice in any case or mater pending before it.
Inherent power under art.142 can not be invoked when alternative remedy is available and has already been availed of. This power is only to ‘correct’ orders when other remedy is not available. In UOI vs. Darshan Devi, 1997 it’s held that since remedy by way of ‘review’ is under the rules of SC, the inherent power cannot be invoked.
On 10.3.11, SC exercising above article, has reduced one year sentence of an 81 (K. Ramabhadran Nair) year old man in a corruption case ‘to the period already undergone’ because of the ‘vegetative state’ he is in.
In a review petition filed by the wife of Nair on the ground that a person of unsound mind and can not be kept under prison u.s.30 of Prisoners Act 1900,(here the individual is suffering from Alzheimer disease and not a sound person), is allowed and ruled in Nairs favor under this extraordinary jurisdiction.
10, మార్చి 2011, గురువారం
'మార్చి ' నెల-బాలలు
ఏమిటేమిటి.....?
మార్చా.....?
లాంగ్ మార్చా....? లుంగీ మార్చా....?
కాదు...ఖద్దరు 'కండూతి' మార్చా...?
ఓహొ...స్కూలు పరీక్షల 'మార్చా '?
మరి ఇది ...
పిలకాయల తలకాయలకి పరీక్షా?
కేంద్ర రాష్ట్రాల ప్రిస్టేజ్ పరీక్షా?
పాలక పక్షుల బ్యాటింగుల
ప్రతి పక్షుల బౌలింగుల మధ్య
పాపం....!
విధ్యార్ధులకు పరీక్షే పరీక్ష!!
పిల్లల ఉసురు పోసుకుంటున్న
ఖద్దర్ల కి
రేపో మాపో పడకపోతుందా
శిక్ష పై శిక్ష!!!
మార్చా.....?
లాంగ్ మార్చా....? లుంగీ మార్చా....?
కాదు...ఖద్దరు 'కండూతి' మార్చా...?
ఓహొ...స్కూలు పరీక్షల 'మార్చా '?
మరి ఇది ...
పిలకాయల తలకాయలకి పరీక్షా?
కేంద్ర రాష్ట్రాల ప్రిస్టేజ్ పరీక్షా?
పాలక పక్షుల బ్యాటింగుల
ప్రతి పక్షుల బౌలింగుల మధ్య
పాపం....!
విధ్యార్ధులకు పరీక్షే పరీక్ష!!
పిల్లల ఉసురు పోసుకుంటున్న
ఖద్దర్ల కి
రేపో మాపో పడకపోతుందా
శిక్ష పై శిక్ష!!!
8, మార్చి 2011, మంగళవారం
no sparing rod
7, మార్చి 2011, సోమవారం
అల్లు వారి పెళ్ళి లోగిలి
అల్లు అరవింద్ గారి వద్ద నుంచి - బన్నీ పెళ్ళి శుభలేఖ వస్తే సరే కదా అని వెళ్ళాం. సాయంత్రం ఎనిమిది కి వెళ్తే పదకొండు కు బైట పడ్డాం. అయితే 'సినీమా పెళ్ళి ' కి వెళ్తే మనలాంటి లస్కుటపా గాళ్ళని 'త్రోసి ' రాజని 'వీ.వీ.వీ.ఐ.పీ.లకి తప్పా సుఖమయమైన ఎన్ట్రీ ఉండదని మరో मार् తెలిసొచ్చింది. హై 'టెక్కు ' సిటీ అంతా జజ్జనకరి జనారే జనసంద్రమైంది ఇలా.
ఎవడు వీపీ నో ఎవడు వీఐపీ నో మనకనవసరం గదా?ఎల్లామా-చూశామా. ఈయన అప్పటి కప్పుడు (అంటే నిన్న మద్యాహ్నం) ఓ కేరికేచర్ ప్రెసంట్ చేద్దామని గీసి ఆనక దాన్ని ఓ 'అయ్య ' చేతిలో పెట్టడానికి విఫలయత్నం చేశారు. అది ఇలా ఉంది.
నేనే అది కాస్తా పగిలి ఊర్కుంటుందని ఓ రెండు మూడు రోజుల తర్వాత డైరెక్ట్ గా ఇంటికెళ్ళి బన్నీ కి ఇస్తామంటే 'అలాక్కానియ్' అన్నారు. ఈ సెక్యూరిటీ ఏ౦దో ఓ స్టేజ్ లో పబ్లిక్ ని పాసు గీసు లేపోయినా ఒదిలి పారేసారు ....పాసు గూల- అని కొంతమంది మొత్తుకుంటే చూశాను. దీని ప్రతాపం సహజంగానే భో'జన ' శాల మీద ఇలా పడింది.
ఈయనైతే ఇలా కుమ్మించుకుంటూ 'కుమ్మటం' మనవల్ల గాదు. పద బయటికొచ్చి ఏ చట్నీసో కాదంటే కేఫ్ నందినీ కో చలేంగే అన్నారు. మరి నేనుండ్లా-ససేమిరా అన్నాను.

5, మార్చి 2011, శనివారం
మా వాడికి ఏడో ఏడు.
1, మార్చి 2011, మంగళవారం
ఇక సునిశిత హాస్య వ్యంగ్యాలు మృగ్యమేనా?
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)