కూసింత సేపు కమ్మగా పాత హిందీ సినిమా పాటలు వినాలనిపించి గూగులమ్మని పలకరిస్తే కోకిలమ్మలాటి పాటల్ని పరిచయం చేసిన ఓ చక్కటి బ్లాగ్ కనిపించిన్ది. ఇంకేం? దాన్ని పట్టి పోస్టు చేసి పెట్టేసాను ఇక్కడ ! ఇది 'తృష్ణ ' గారి బ్లాగు! చాలా బాగు బాగు! వారికి కృతజ్ఞ్యతలు! వారు వాకిలి అనే వెబ్ మాగజైన్ లో వాన పాటలని (హిందీ) పట్టేసి 'తెలుగు'లోకి తర్జుమా చేసి - కవిత్వం కలిపెసి... వావ్... విని , చదివి అనుభవించాల్సిందే! వారికి మళ్ళీ కృతజ్ఞ్యతలు ! ఇంకా మరి కొన్ని హిందీ పాటల్ని అనువదించి బ్లాగ్ కేక్కిస్తే బావుంటుందని , ఈ సారి వారి బ్లాగు గడప తట్టి చెబుతాను.
2 కామెంట్‌లు:
ఈ పోస్ట్ ఇప్పుడే చూస్తున్నానండి..థాంక్యూ వెరీమచ్! మ్యూజిక్ ఇంట్రస్ట్ ఉంటే నాది "సంగీతప్రియ" అని మరో బ్లాగ్ ఉంది.. అది కూడా చూడండి..
బెస్ట్ విషెస్,
తృష్ణ.
చూశాను తృష్ణ గారు. గొప్పగా ఉంది.సరాసరి ఓ.పి.నయ్యర్ వారి పోస్టుకి వెళ్లాను.ఈ విశాల......
ప్రశాంత..
ఏకాంత...
సౌధంలో ...నిదురించు జహాపనా...!
ఆ జహాపనా , మన ఎమ్మెస్ జహాపనా ఇద్దరూ , ఏయే ప్రశాంత లోకాల్లో విశ్రమిస్తున్నారో కానీ, ఎంతో శ్రవణపేయం గా ఉన్న ఆ మధుర ధుని తో మమేకమై, ఇక్కడే ఇహలోకం లోనే ఎంతో సేద తీర్చే గాత్రం నాకు చిరపరిచితమే అయినా ... మీ బ్లాగు లోగిలిలో మరిన్ని విశేషాలు తెలుసుకున్నాను త్రుష్ణ గారూ. మీకూ, మీ అభిరుచి కీ శతధా ధన్యవాదాలు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి