- మా పాపవి ఫస్ట్ ఇంటరు ఇంగ్లీషు మార్కులు 95-98 మధ్య ఎక్స్పెక్ట్ చేస్తే 84 వచ్చాయి. ఎందుకు తగ్గాయో....రైటింగ్ బాలేదా...ప్రశ్నలు వదిలేసిందా... అని ....రూ.600/- కట్టి రి-వెరిఫికేషన్చేయించాను.ఇలా సమాధానం వచ్చింది.
దీంతోనే వాళ్ళు బదులుగా ఆన్సర్ షీట్ 'నకలు' పంపించారు. (ఒక పేపరుకు అంత కట్టించుకుని -రీ-కౌంటింగ్, రీ-వెరిఫికేషన్ మాత్రమే చేస్తారుట. ’రీ-వాల్యూ’ చేయరట.)
- సరే...తర్వాత ఆన్సర్ షీట్ చూస్తే తెలిసింది. ముత్యాల్లా రాసింది అన్ని పేజీలూ. అన్ని చోట్లా 'కరెక్ట్' టిక్ మార్క్స్ పెట్టి ఉన్నాయి. ఒక చోట 'రౌండు' పెట్టాడు . రెండు బిట్లు ( 1/2+1/2 =1 mark) తప్ప అన్నీ కరెక్ట్ గా ఉన్నాయి. కానీ అన్నింటిలోనూ ఇష్టారాజ్యంగా తగ్గించుకుంటూ మార్కులు వేయడం వల్ల అలా తగ్గయని తెలిసింది. ఆ 'రౌండు' పెట్టిన పేజీ ఇలా ఉంది.......
సెక్షన్ A లో క్వశ్చన్ b లో అన్నొటేషన్ రాయాలి. నాలుగు మార్కులన్న మాట. ఆ ‘Banglore’ లో స్పెల్లింగ్ తప్పయిందట. టెక్స్ట్ బుక్ లో 'Bangalore' అనుందట. ఓ మార్కు 'కట్'. చక్కగా ఆన్సర్ చేస్తే ఇలా ఉంటాయి. అసలు ‘Banglore’ నౌన్ అయినప్పుడు ఎలా రాస్తే యేం! Hydrabad అనున్నా Hyderabad అనున్నా నౌన్ లో మార్క్స్ కట్ చేయరు. చెయగూడదు.వాళ్ళ టీచర్ కి చూపిస్తే ‘దీనికి...... నేనైతే 93 మార్క్స్ వేస్తానమ్మాయ్’అందట.
- ఇంతకీ .......బండ బూతులు రాస్తే .....'సగం' మార్కులేస్తారు. చక్కగా రాసినా మరో మార్కు ఎక్కువేస్తారు. అంతే.....సో......పిల్లకాయ్‌లూ.... అనుకున్నదానికన్నా కొన్ని మార్కులు తగ్గాయని మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ తగ్గించుకోకండి. మందుకొట్టి వాల్యూ చేశేవాళ్ళూ ఉంటారు. డోంట్ గెట్ డిసప్పాయింటెడ్!
1 కామెంట్:
ur daughter's hand-writing is super..
కామెంట్‌ను పోస్ట్ చేయండి