అనగనగా ఓ ఆస్ట్రేలియన్ సుందరాంగి మోడల్ - తన బికినీ మీద మన హిందూ దేవత లక్శ్మీదేవి బొమ్మ వేసుకు తిరిగిందట. ఇవి అనగనగా ఓ హిందీ డైలీ లో అచ్చైనవిట. హన్నన్నా! ఎటు పోనిస్తున్నాం....!! ఈ తరహా విపరీత చర్యలు లోగడ చాలా చూశాం.చదివాం. ఏ భగరంగ్ దళ్ లెవెల్ గ్రూప్సో డౌన్ డౌన్ అంటం కూడా చదివాం. (ఇది ఏ ఒకళ్ళకో కాక గుడ్ సిటిజన్లందరూ ఖండించాల్సిన విషయమని నా భావం)
హర్షించదగ్గ న్యూసేంటంటే - గౌ"అలహాబాద్ కోర్టు వారు దీన్ని "హిందువుల మతభావజాలాన్ని అవమానించే చర్య" గా పిల్ కింద సుమోటో కేసు గా తీస్కుంది నేడు. శభాష్! అసలు ఒక మతాన్ననే కాదు- ఏ మతానికైనా ఇలాటి విక్రుత చర్యలు వాంఛనీయమని ఎవరు అనరు. పైగా మహిళా దేవత చిత్రాన్ని మహిళే.....!! రామ రామ!!
ఆ మధ్యన ఓ చానల్లో "ముద్దు" మీద థర్టి మినిట్ ప్రోగ్రాం దుమ్ము దులిపేసింది. "ముద్దు వద్దని" కాదు. "ముద్దు ముచ్చట్లిలా" ఉంటాయని. ఇంకేం "కంటెంట్" తో కుమ్మొచ్చు. తర్వాత మిగతా ఛానల్స్ కూడా నేను సైతం అంటూ ముద్దు స్టోరీలు వండి వార్చాయి. గ్రేట్నెస్ ఏంటంటే...సదరు ప్రోగ్రాంలకి ఫిమేల్ ఆంకర్సే "రసానుభూతి" తప్పకుండా లయవిన్యాసం చేస్తూ ప్రెసెంట్ చేస్తారు. బాంది కదా!! (తర్వాత కొన్నాళ్ళకి బ్రెస్ట్ - సారీ - బెస్ట్ ఆంఖర్ అని ఏ అభినందన సన్మాన - శాలువా సత్కారం ఇచ్చి గౌరవించుకుంటే మనం చప్పట్లు కొడతాం - అది వేరే సారి బ్లాగుతాను) పూర్వాశ్రమం లో - సినిమాల్లో "బూతంతా" చూపించి ఆఖరున "ఇలా" ఉండగూడదబ్బాయ్ అని ముక్తాయించేవాళ్ళు. ఆ రోజులు పోయి టీవీల్లో ఇప్పుడు "బూతంతా" చూపించి నేటి "ట్రెండ్" అని సెలవిస్తున్నారు. మనం "గామోసు" అనుకుంటాం! ఇదేదో ఒక వేవ్ క్రియేట్ చేసి ... వెండి తెర మీద "లిప్ లాక్" ని బాహాటంగా చూపించటం "నేరం" కాదు....అతి సహజం అనే ధోరణి ప్రేక్షక లోకంలో చొప్పించే ధోరణి ఈ మధ్య మీడియాలో కనిపిస్తోంది. ఈ కోవలోకే వస్తున్నాయ్ ఈ మధ్య కనిపిస్తున్న కొన్ని వార్తా ప్రకటనలు. హైట్ ఏంటంటే... ఏది "పరమోత్తమ చుంబనం" ఏది " పరమోత్తమ ఐటం సాంగ్" లాటి "పోటీ"లు పెడుతున్నారు ఇదిగో ఇలా.....