4, ఏప్రిల్ 2011, సోమవారం

'ఖరము' కాదా 'శ్రీకరము' ?

ఉగాది అంటే
ఎందుకో నాకు
వ్యక్తిత్వ వికాస గ్రంధంలో
తొట్టతొలి అధ్యాయంలా
హృద్యంగా అనిపిస్తుంది!
ఎందుకంటే అది-
ఎండిన గుండెల మోళ్ళు
మళ్ళీ తడి చిగుళ్ళు
పెడతాయని చెప్తుంది!!
బ్రద్దలైన అనుబంధాల బీళ్ళు
సారవంతమైన లోగిళ్ళవుతాయని
తెలుపుతుంది!!!
కొన్నాళ్ళపాటు తాళాలు వేస్కున్న
ఎల కోయిల గళాలు-
మళ్ళీ యుగళ గీతాలై గుబాళిస్తాయని
చాటుతుంది!
శిశిరంతో సమరం
వసంతంతో సరసం
కోసమేనని తేట పరుస్తుంది!!
షడ్రుచులతో జీవనం
షడ్రసోపేత భోజనమే అంటుంది!!!
కోకిల ఉత్తేజ గీతాలు విన్న పశుర్వేత్తి'
'ఖరము'  సైతము
కాదా  'శ్రీకరము'  అంటుంది!

కామెంట్‌లు లేవు: