9, మే 2008, శుక్రవారం

పరుగు.....

'ద్వితీయ విఘ్నం' అని మనకి ఒకటుంది. అది లేకుండా ఉండడానికి ఇవ్వాల ఓ   పోస్టింగ్ పెడదామనిపించింది. మే నెల మొదటి ఆదివారం ప్రతి సంవత్సరమూ ' ప్రపంచ నవ్వుల దినోత్సవం ' గా జరుపుకున్తారనిన్నూ, యాద్రుచికంగా ఇదే వారం లో నేను కూడా 'బ్లాగు బోగులు' మొదలెట్టదమూ జరిగిపోయింది. ఉంకో యాద్రుచికమంటే, unesco  వాళ్లు కూడా 'మే ౩ ని ప్రెస్ ఫ్రీడం డే గా 1993 నుంఛి  మొదలెట్టారుత. ప్రేస్స్స్ ఫ్రీడం ఏమో గాని, బ్లాగ్ ఫ్రీడం మాత్రం మనందరి కి కలిసోచిమ్ది.  [చదివేవాడు ఉండాలే గాని]. ఏతా వాతా  నేను చెప్పేదేమంటే, నవ్వుల దినోత్సవం ఈసారి మే 8న వస్తె కొద్దిగా అటూ ఇటూ గా నా బ్లాగు ఆవిష్కరిమ్పసుసాను అన్నమాట.
నవ్వులు అంటే గుర్తుకు వంచ్చింది .....ఏంటంటే.... గత వారం పాసు వస్తె వెళ్లాం. ...పాసు - అంటే  'పరుగు' సినిమా కి 'పాసు'. pre-view కే సుమా. సినిమా మహా గొప్ప గా ఉందని పలువురు సంతోషం వేలిబుచ్చారు. నేను ప్రత్యేకం చెప్పెదేమి లేదు గాని... హాస్యం ఎంత అధ్వానం అయిందంటే...మంచు లో 'పరుగు ' ఉంటుంది మూవీ లో. ఒకడికి ఒకడు కనిపించదు. . అలసిపోయి కమెడియన్  'సునీల్' ఒకచోట నుంచుని రొప్పుతూ  ఉంటాడు. మన లేటెస్ట్ టెక్నాలజీ  స్టీరియో ఫోనిక్ సౌండ్ స్కీమ్ ఉందిగా ...డైరెక్టర్ గారు దయ తో సౌన్డ్స్ ప్రవేశ పెట్టాడు. దేనిది .?. రాయతానికే సిగ్గేస్తుంది...మనకి 'వినిపిస్తారు' హాల్లో. natural calls  సౌన్డ్స్ అన్నమ్మాట. తెలుగు లో అయితె 'అదోముఖ వాయు నిర్గమనం' అనాలనుకుంట...అది 'విని' సునీల్ 'బాబోయ్' అంటూ పారిపోతాడు అక్కడినుంచి....ఆ సౌండ్ థియేటర్  లో ప్రముఖం గా వినిపిమ్పచేసి దర్శకులు తరించి, మనని తరిమ్పచేస్తారు. ఇదీ మనవాళ్ళ 'హాస్య ప్రియత్వం'. హాస్యానికి ...ఎకసేక్కానికీ....తుచ్చ వ్యంగానికీ మన తెలుగు సినిమా కి తేడా తెలియకుండా పోయింది....నిజంగా ఖర్మ కదూ.

కామెంట్‌లు లేవు: