'శుభం భూయాత్' అంటూ వుంటాట్ట మా వారి కోలీగు ఓడు ఎవరికైనా బెస్ట్ విషెస్ చెప్పాలంటే. సరే...బ్లాగుడు పోస్ట్ క్రియేట్ అయితే చేశాను కాబట్టి నాకు నేనే శుభం భూయాత్ చెప్పుకుంటే పోతుంది కదా!. లాగు తొడగగానే సరిపోదు. కాస్త జారకుండా బిగుతుగా ఉండేలా చూసుకోవాలి కూడా. అలాగే ' బ్లాగు' పెట్టగానే సరిపోదు. మంచి బిగుతుగా వుండాలి అని నా ఉద్దేశ్యం. ఇవ్వాల్టి నా బ్లాగోగులు నీను జాగ్రత్తగా చూస్తే, పబ్లిక్ లో బాగా చూస్తారని నా ప్రగాఢ విశ్వాసం. మరైతే.....తెలుగు స్క్రిప్టు కొడుట్టూ ఉంటే 'తెలుగు తల్లి' ని క్షోభ పెడుతున్నాననిపిస్తూంది. కొన్నాళపాటు చూసి 'తెలుగు తల్ల్లి' కన్నీరు పెడుతుంటే, ఆనక 'ఆంగ్లం' లోకి దిగి ఆ భాషనే ఉద్ధరించే కార్యక్రమం చేపడతను. ఇది నా ఫూచీ.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి