మా శ్రీవారి పిన్నీ- బాబాయ్ రెండు రోజుల పర్యటన ముగిసి ఈరోజు ఉదయం జన్మ భూమి ఎక్స్ప్రెస్ లో కొల్లూరు వెళ్లారు. vrudhapyam, కొడుకు కోడళ్ళ నిష్తూరాలు ఇత్యాది rejections మద్ద్య వాళ్ళు రావడం జరిగింది .నేనే ఊరటగా ఉంటుందని రమ్మన్నాను. Maintenance అండ్ welfare of senior citizens and parents act 2007 (జీరో-సెవెన్) కింద ఏమైనా కేసు file చేయొచ్చా అని అడిగితే ...లేదు.. ఇంక tribunals form చేయలేదు అని చెప్పాను. ఆనక 'human rights' ఆఫీసు లో సంప్రతించమని చెపితే అక్కడికి వెళ్ళాడు గాని ..specific గా కంప్లైంట్ చేయాలని చెప్పారుట.. అంతే కదా మరి.... నేనైతే మళ్ళే పిల్లలందరినీ కూర్చోపేట్టి చర్చలు జరపండి... extreme step తీసుకోవద్దు అని ఫైనల్ గా చెప్పి పంపాను. వాళ్ల చిన్నబ్బాయ్ Buddi వచ్చె శని వారం వచ్చే సూచనలు ఉన్నై. చట్టపరం గా ఒకళ్ళు సలహా ఇస్తే - ఆద్యాత్మిక పరంగా మరొకళ్ళు ఇచిన సలహా తో 'పూజాదికాలు' చేయిస్తున్నాడు. నామటుకు నేను కోరుకునేది -సర్వే జనా సుఖినోభవంతు.
3, జూన్ 2008, మంగళవారం
13, మే 2008, మంగళవారం
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు లేదా మరో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు అనే జీవులు అంటే 'మహా చిరాకు' పడే లేదా ప్రదర్శించే ప్రముఖులూ పత్రికలూ మనచుట్టూ మస్తు ఉన్నై. ఈ నేపద్యం లో రెండు విషయాలు నన్ను ఆకర్షించాయి.
ఒకటి, ౯.౫.౦౮ (నైంత్ మే)స్వాతి పత్రిక లో ఒక పేజీ. ఎస్. కొండల రావు అనే కర్మయోగి 1970 లో'క్లార్క్ కం typist' గా రాష్ట్ర ప్రభుత్వ సర్వీసెస్ లో చేరి 1996 లో నే అసిస్టెంట్ కమీషనర్ గా ప్రొమోట్ అయ్యారుట. ఈన ఒక doctor కూడాను ata. (చదవలేదు సుమ... ఏదో university వారు ' చదివించారు' ata. ) ప్రస్తుతం endowments డిపార్టుమెంటు, కాకినాడ లో రిజినల్ జాయింట్ కమీషనర్ ఆట. క్లార్కులు క్లార్కులు గా మగ్గి చావాల్సిన ఈ కర్మ భూమి లో ఈ మహానుభావుడు ఇంత జంప్ చేసాడంటే ....ఆయనకు జోహార్లు. ఇది మన రాజ్యాంగం 'చదివించిన' 'కోటా ' మహిమా లేక 'స్వయం కృషా' లేక 'ఇంకేదయినా' నా? అందరు 'క్లార్కులు' ఇలా అయితె ఎంతబాగుండు?
రెండో అంశం. నేటి ఈనాడు పదిహేనవ పేజి లో ఓ చిన్న వార్త. ఏంటంటే, దేవ దత్త్ అనే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి (గౌహతి) ACRS.(వార్షిక రహస్య వేదిక) సరిగా లేకపోవడం , ఆ విషయం తనకి తెలియక పోవడం మూలాన ప్రమోషన్స్ రాకపోవడం జరిగిందట. సదరు వ్యక్తి కోర్టుకు వెళితే , గౌహతి కోర్టు 2001 లో.... 'రహస్య నివేదికలు వ్యక్తులకు చెప్పాల్సిన పని లేదు' అని హై కోర్ట్ తీర్పు చెప్పితే....ఆనక సుప్రీం కోర్ట్ లో కేసు వేయడమూ, సదరు అగ్ర న్యాయ స్థానము 'నో...నో...ఉద్యోగికి సమాచారాన్ని అంతటినీ అందించాల్సిందే...పద్నాల్గవ అధికరణ (చట్టం ముందు అంతా సమానులే) పాటించాల్సిందే...' అంటు Right to Information Act కన్నా పవర్ఫుల్ జడ్జిమెంట్ ఇట్చిందిట. ఇది సామాన్యమయిన రిలీఫ్ కాదు ఉద్యోగికి. అసలు ఈ రహస్య నివేదికలు
కాన్సెప్ట్ ఒకరకంగా తప్పు. ఇది ఉండబెట్టి బ్రిటిష్ వాడి గులాం గిరి భారతం లో నడుస్తుంది గాని... లేకపొతే ప్రభుత్వ ఉద్యోగుల క్రియేటివిటీ వాళ్ళ వర్క్ కల్చర్ ఇబ్బడి ముబ్బడి గా పెరిగిపోదు...? ఆ దిశగా ఈ శుభపరిణామం పరిపక్వం గా మారే రోజు దగ్గరలోనే ఉంది.

9, మే 2008, శుక్రవారం
పరుగు.....
'ద్వితీయ విఘ్నం' అని మనకి ఒకటుంది. అది లేకుండా ఉండడానికి ఇవ్వాల ఓ పోస్టింగ్ పెడదామనిపించింది. మే నెల మొదటి ఆదివారం ప్రతి సంవత్సరమూ ' ప్రపంచ నవ్వుల దినోత్సవం ' గా జరుపుకున్తారనిన్నూ, యాద్రుచికంగా ఇదే వారం లో నేను కూడా 'బ్లాగు బోగులు' మొదలెట్టదమూ జరిగిపోయింది. ఉంకో యాద్రుచికమంటే, unesco వాళ్లు కూడా 'మే ౩ ని ప్రెస్ ఫ్రీడం డే గా 1993 నుంఛి మొదలెట్టారుత. ప్రేస్స్స్ ఫ్రీడం ఏమో గాని, బ్లాగ్ ఫ్రీడం మాత్రం మనందరి కి కలిసోచిమ్ది. [చదివేవాడు ఉండాలే గాని]. ఏతా వాతా నేను చెప్పేదేమంటే, నవ్వుల దినోత్సవం ఈసారి మే 8న వస్తె కొద్దిగా అటూ ఇటూ గా నా బ్లాగు ఆవిష్కరిమ్పసుసాను అన్నమాట.
నవ్వులు అంటే గుర్తుకు వంచ్చింది .....ఏంటంటే.... గత వారం పాసు వస్తె వెళ్లాం. ...పాసు - అంటే 'పరుగు' సినిమా కి 'పాసు'. pre-view కే సుమా. సినిమా మహా గొప్ప గా ఉందని పలువురు సంతోషం వేలిబుచ్చారు. నేను ప్రత్యేకం చెప్పెదేమి లేదు గాని... హాస్యం ఎంత అధ్వానం అయిందంటే...మంచు లో 'పరుగు ' ఉంటుంది మూవీ లో. ఒకడికి ఒకడు కనిపించదు. . అలసిపోయి కమెడియన్ 'సునీల్' ఒకచోట నుంచుని రొప్పుతూ ఉంటాడు. మన లేటెస్ట్ టెక్నాలజీ స్టీరియో ఫోనిక్ సౌండ్ స్కీమ్ ఉందిగా ...డైరెక్టర్ గారు దయ తో సౌన్డ్స్ ప్రవేశ పెట్టాడు. దేనిది .?. రాయతానికే సిగ్గేస్తుంది...మనకి 'వినిపిస్తారు' హాల్లో. natural calls సౌన్డ్స్ అన్నమ్మాట. తెలుగు లో అయితె 'అదోముఖ వాయు నిర్గమనం' అనాలనుకుంట...అది 'విని' సునీల్ 'బాబోయ్' అంటూ పారిపోతాడు అక్కడినుంచి....ఆ సౌండ్ థియేటర్ లో ప్రముఖం గా వినిపిమ్పచేసి దర్శకులు తరించి, మనని తరిమ్పచేస్తారు. ఇదీ మనవాళ్ళ 'హాస్య ప్రియత్వం'. హాస్యానికి ...ఎకసేక్కానికీ....తుచ్చ వ్యంగానికీ మన తెలుగు సినిమా కి తేడా తెలియకుండా పోయింది....నిజంగా ఖర్మ కదూ.

8, మే 2008, గురువారం
'శుభం భూయాత్' అంటూ వుంటాట్ట మా వారి కోలీగు ఓడు ఎవరికైనా బెస్ట్ విషెస్ చెప్పాలంటే. సరే...బ్లాగుడు పోస్ట్ క్రియేట్ అయితే చేశాను కాబట్టి నాకు నేనే శుభం భూయాత్ చెప్పుకుంటే పోతుంది కదా!. లాగు తొడగగానే సరిపోదు. కాస్త జారకుండా బిగుతుగా ఉండేలా చూసుకోవాలి కూడా. అలాగే ' బ్లాగు' పెట్టగానే సరిపోదు. మంచి బిగుతుగా వుండాలి అని నా ఉద్దేశ్యం. ఇవ్వాల్టి నా బ్లాగోగులు నీను జాగ్రత్తగా చూస్తే, పబ్లిక్ లో బాగా చూస్తారని నా ప్రగాఢ విశ్వాసం. మరైతే.....తెలుగు స్క్రిప్టు కొడుట్టూ ఉంటే 'తెలుగు తల్లి' ని క్షోభ పెడుతున్నాననిపిస్తూంది. కొన్నాళపాటు చూసి 'తెలుగు తల్ల్లి' కన్నీరు పెడుతుంటే, ఆనక 'ఆంగ్లం' లోకి దిగి ఆ భాషనే ఉద్ధరించే కార్యక్రమం చేపడతను. ఇది నా ఫూచీ.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)