వర్చు ఇలా వాపోయిన సందర్భం ఆయన మాటల్లోనే ......."డాక్టర్స్ ని మనం దేవుళ్ళంటాం! ప్రాణం పోతుంటే ’పోసే’ లేక ’ఆపే’లక్షణం వారికుండబట్టే ఇలా అంటాం. అయితే ఒక డాక్టరూ మహా అయితే ఒక కాంపౌండర్ లేక టేస్ట్ ని బట్టి ఒక నర్సమ్మ ఉండేవారు పూర్వం! పేషంట్ కి సదరు డాక్టరంటే ’ఆకర్ష’నో లేక ’వికర్ష’ నో ఉండేది ట్రీట్మంటు బట్టి. కార్పొ’రేట్’ ఆసుపత్రులు వచ్చింతర్వాత వివిధ రకాల విభాగాలతో వివిధ రకాల సిబ్బందితో ఇబ్బందులు ఇబ్బడి ముభ్భడిగా పెరిగి - ఒక విభాగంలో మనకున్న ’జబ్బు’మరో విభాగంలో ’మరో జబ్బుగా’ పరిణమిస్తుంది. ఒక్ జబ్బుతో వచ్చి ఒక జబుతో బయటికి వెళతాం లేదా ’పోతాం’. వైద్యో నారాయణో ’హరి’ రావులు మామూలుగా ’ట్రింగ్’ అని బెల్లు కొట్టి మరో ’మూడిన’ వ్యక్తి కి ఎంట్రి కల్పిస్తారు. ఈ ’విభాగాల’ జబ్బు ’గవర్నమెంట్లో’ను ’కార్పొరేట్లోనూ’పోటాపోటీగా పెరగడం పేషంట్‍కి పేషన్సు పోయి ’శ్మశాన వైరాగ్యం’ అడ్వాన్స్ గా కనిపింపజేసి ఆనక శ్మశానం అంటే అకస్టం అయిపోయేలా చేసే చక్కటి ప్రక్రియ. భేష్! ఇదొక విషవలయం. ఎవడి పాపాన వాడే ’పోతాడు’అనే చక్కని ఆధ్యాత్మిక భావన పరిడవిల్లేలా చేసి ’పుణ్యం’ కట్టుకుంటున్నారు ’వైద్యహరినారాయణులు’. అదీ ఆ రోజులకీ ఈ రోజులకీ తేడా!! ఈ నేపధ్యంలోనే - డాక్టర్ల ఆరాద్యభావానికి ’జబ్బు’ పట్టింది పబ్లిక్లో. ఇదీ నేను చెప్పదలుచుకుంది! అతి చిన్న రెండు ఉదాహరణలు(నాకు సంబంధించి) చెప్పి తప్పుకుంటాను.
ఒకటి-హార్ట్ ఆపరేషన్ అయిపోయి సక్సెస్‌ఫుల్గా బయటి కొచ్చిన మా అమ్మని అన్నీసిట్రిక్ ఫ్రూట్సే ఎక్కువ తినమన్నాడు డాక్టర్. అరటి పండు సంగతేంటి అని అడిగిన నాకు -పోయి డయాబెటిస్ట్ని ’కంసల్ట్’ చేయండి అని సిన్సియర్‌గా సలహా ఇచ్చాడు కార్పొ’రేట్’ డాక్టర్! ’ట్రింగ్’అంటూ బెల్లు. విభాగ వైపరీత్యం అంటే ఇదేనేమో!!
రెండు-నాకు నిన్నరూట్ కెనాల్ చేశారు పళ్ళకి! మరో సిట్టింగ్ కూడా ఉంటుంది. రెండురోజుల ముందు నుంచి పూర్తిగా దంతాలకి ’క్రౌన్’ పెట్టెదాకా బలమైన ’ఆర్డెంట్’ మాత్రలు వాడి వాడీ ’వాడి’పోవాల్సుంటుంది. టొటల్‌గా ఆంటీబయాటిక్స్‌తో భ్రష్టు పట్టిన దేహాన్ని రిపైర్ చేయడానికేమన్నా ఆంటీడోట్ ఇస్తారా దేహం శుభ్రం కావడానికి అనడిగాను మిడిమిడి ఙ్యానం తో. సదరు డాక్టర్లు ఇద్దరూ అనీక్వివోకల్‌గా నకు చెప్పిన సమాధానం - మందు ఒక లార్జ్ కొట్టి పడుకోండి. సరిపోతుంది. నా పరిధిలో - కంటేంపరరీ హెల్త్ ఫీల్డ్ కు పట్టిన ’జబ్బు’గా నేను రికార్డు చేయదలచుకున్నాను. గ్లోబలైజేషన్‌లో వైద్య పరిఙ్యానం పెరిగినా మరిగుజ్జు డాక్టర్లు అంతే పెరిగారు. పరిశోధన తగ్గి పెగ్గు ఎక్కువైంది వైద్యగణానికి అనుకోవచ్చా?

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి