11, ఫిబ్రవరి 2011, శుక్రవారం

మాలిష్......మాలిష్.....

భజన తో ముందుకు సాగుతోంది సమాజం. భజనతో నే జగం. జనపురోగతి భజన తో ప్రభంజనంలా జ్వలిస్తోంది.అయితే ఒక్కోసారి అతి భజన 'సర్వత్రా వ్ర్జ్యతే' కాకపోతే దుష్పరిణామమే మారి. రాజస్థాన్ లో ఓ మంత్రివర్యుడు-ఖాన్ నామధేయుడనుకుంటా...ఆసలు ప్రతిభా పాటిల్ ప్రతిభ ఎలా ఇనుమడించిందో సెలవిచ్చాడట. ఆవిడ సామాన్యంగా పైకి రాలేదు నాయనలారా..చూసి అలా కశ్టపడి పైకి రావాలి మరి...ఆవిడ మున్నెన్నడో ఇందిరాగాంధి గారింట్లో  ఒహానొహప్పుడు  ఒహ 'వంట మనిషి గా' అవతరించి ఆనక 'మహా మనీషి గా' ఎన్నబడి నేడు ఈ స్థాయి లో ఉండడానికి కారణం అయినారు-అని సెలవిచ్చాడట సదరు ఖాన్ గారు కార్యకర్థల సమావేశంలో ఎన్తో ఆవేశం గా. ఇది కాగానే మహా మంత్రి 'అశోక్ గెహ్లాట్' ఉక్కిరి బిక్కిరై -ఇది పొగడ్త కాదురా నాయనా..తెగడ్త అని చెప్పి ...పై నించి ...అదే...హై కమాండ్ నుంచి ఆదేశాలతో ....మంత్రి పదవి ఊడగొట్టాల్సి వచ్చింది....అర్ధమయిందా? అప్ప్పుడప్పుడు 'ఖాన్ తొ గేమ్స్ ఆడుకోవచ్చు మరి.

కామెంట్‌లు లేవు: