25, ఫిబ్రవరి 2011, శుక్రవారం

తెలుగు హాస్యం మరణించింది.


20, ఫిబ్రవరి 2011, ఆదివారం

క.స్క్రీ.ద.అప్పలరాజు క'హానీ'

భారత్-బంగ్లా సెకండ్ ఇన్నింగ్స్ చూడొచ్చులే  అని మాట్నీ కి ఇంటిల్లిపాదీ  పైన ఉటంకించిన సైన్మా కి వెళ్ళాం ఐమాక్స్ లో స్క్రీన్-౩ లో. ప్రోమొలు చూసి హాస్య నటులంతా ఉన్నారు కదా అనిన్నీ, హాస్యప్రియులం కదా అనిన్నీ, చూసేయటం మచిదనిన్నీ చూసీశాం. ఇలా ముందే  ఫిక్స్ అయాం కాబట్టి పస్ట్ హాఫ్ 'బ్రహ్మాణ్డం'గా నవ్వుల్తో హొరెత్తిపోయింది హాలు. అయితే  సెకెన్డ్ హాఫ్ మాత్రం 'బోరెత్తి పోయిందీ.
       మీ గురించి మీరేమనఉకుంటునారు అని ఓ చానలమ్మ అడిగిన ప్రశ్న కి మన  వర్మాజీ సమాధానం 'పిచ్చినాకొడుకుని ' అని;కర్టెసి కి 'బాగున్నారా' అని అడిగితే -'నేనెప్పుడూ బాగానే వుంటాను ' అని రిప్లై. ఇలాంటి సమాధానాలను  ఒక లెవెల్లో  సెటిలైపోయిన  వాళ్ళు చెబితే 'ఆనెస్టీ' అంటాం. మన లాంటి మామూ లోళ్ళు  చెబితే 'తింగరీ గాళ్ళంటారు. అసలిలాంటి తింగరి సమాధానం చెప్పడం అంత వీజీ కాదు. 'ముంగేరీ లాల్ 'కీ సప్నా లోనే సంభవం. మనవలా చెప్పలేం కదా.
      అప్పల రాజు తో మొదలెట్టి ఈ తింగరి సోదేమిటి అని అంటారా? పాయింట్ కొస్తున్నా. మన వ్యవస్థ లో ఇలాంటి 'తింగరి ' అభిప్రాయం చెప్పాలంటే చాలా పెద్దోళ్ళయి వుండాలంటాను. 'సోనియా విదేశీయత ' మీద కామెంట్ చేయడానికి మనలో ఎంతమందికి గట్స్ ఉన్నాయి? గు.వెంకతటస్వామి గారు గాబట్టి టపీ మని సెలవిచ్చారు. చాలా ఏళ్ళ క్రితం ఓ ఈశాన్య రాష్ట్ర మంత్రివర్యుడు ఇలా సెలవిచాడు గానీ ఆనక సైడులయినయి పోనాడు.(పోవాల్సొచింది)హైలెవెల్ పర్సనాలిటీస్ ని కామెంట్ చేయడం అంత వీజీ కాదు 'తింగరితనం' లేని వాళ్ళకి. అలాగ అంతటి నేర్పు వర్మ కి గలదని ఈ సైన్మా నిరూపిస్తుంది. పాయింటు కొచ్చానా? సిన్మా ఇండస్ట్రీ లో ఫాల్తూ గాళ్ళ దగ్గరినుంచి ఫాల్కే గాళ్ళ దాకా సెటైర్లు వదిలి చూపించే 'తింగరి ' తనం అనబడే 'నేర్పరితనం' ఇందులో బాగా ప్రూవ్ చేస్కున్నాడు వర్మ. మరావిధంగా ముక్కున 'హన్నా' అంటూ వేలేసుకుంటాము. విషయానికొస్తే సునీల్ స్టెప్పులు అదిరాయంటున్నారు తోటి జనం.బ్రహ్మానందం, వేణు,హర్షవర్ధన్,తనికెళ్ళ, రఘుపతిబాబు,క్రుష్న భగవాన్ తదితరులు ఆక్షన్ అదరగొడితే- కనిష్క పాత్రధారి, బ్రహ్మానందమ్-వాంప్ పాత్రధారిణీ ల సోయగాలకి 'తెర ' లేపాడు వర్మ అనొచ్చు.
     "మనమీదేం చూపించాడో గురుడు" అంటూ మిగతా ఇండస్ట్రీ తిట్టుకుంటూ అయినా సరే చూసేస్తారు దీన్ని. మాకైతే మాత్రం - 'రక్తాలు కారే' సిన్మాల కన్నా 'హాస్యయుక్తమైన ' సిన్మాలే కాసింత రెలీఫ్ ఇస్తాయని నమ్మకం.

16, ఫిబ్రవరి 2011, బుధవారం

మా తేజ్ గాడు రెండు నిమిషాల్లో వేసిన పెన్సిల్ స్కెచ్-16.2.11


ఇంత బలహీన ప్రధాని అనుకోలేదు.(17-2-2011)


జయదేవుని 'ఉత్తర'గోవిందం

వర్చస్వి అప్పట్లో ఊపుగా, తుష్టిగా కార్టూన్ స్రుష్టి చేస్తున్న రోజుల్లో- జయదేవ్ మరో రెండు టపాలు ఇవిగో....!


ఆగష్టు 1984 లో విజయవాడలో Prof.,Dr.జయదేవ్ తో ముచ్చట్లు.

మొదటి సారి మెగా కార్టూనిస్టు తో విజయవాడ లో ముఖాముఖి జరిగింది. చెన్నై లో ఉంటున్న ఆయన ఇలా ఎక్కడికి పని మీద వెళ్ళినా ఆయా ప్రాంతాల్లోని బచ్చా కార్టూనిస్టులని ములాకాత్ చేస్కుని ఆశీర్వదించి పంపటం ఆయన అలవాటు. ఈ రోజుల్లో ఎవడికి పట్టిందండీ అదంతా? ఆ రోజులే వేరు....ప్చ్ ! (అన్నట్టు 'ప్ఛ్' టైటిల్ తో ఆరోజుల్లో వారి స్ట్రిప్ కార్టూన్ సీరియల్ గా వచ్చేది.)

వ్యంగ్య చిత్ర సామ్రాట్ ప్రొఫెసర్ డా:జయాదేవ్ బాబు గారి ఆశీర్వచనాలు.(లెటర్ హెడ్ ప్రధమ భాగం లో చిత్రం -వర్చస్వి సంతకం -చిత్ర వసంతం లా కురిపించారు తన పాళీ నుంచి)



11, ఫిబ్రవరి 2011, శుక్రవారం

కొన్ని ప్రచురితాలు-కొన్ని అప్రచురితాలు.
























మాలిష్......మాలిష్.....

భజన తో ముందుకు సాగుతోంది సమాజం. భజనతో నే జగం. జనపురోగతి భజన తో ప్రభంజనంలా జ్వలిస్తోంది.అయితే ఒక్కోసారి అతి భజన 'సర్వత్రా వ్ర్జ్యతే' కాకపోతే దుష్పరిణామమే మారి. రాజస్థాన్ లో ఓ మంత్రివర్యుడు-ఖాన్ నామధేయుడనుకుంటా...ఆసలు ప్రతిభా పాటిల్ ప్రతిభ ఎలా ఇనుమడించిందో సెలవిచ్చాడట. ఆవిడ సామాన్యంగా పైకి రాలేదు నాయనలారా..చూసి అలా కశ్టపడి పైకి రావాలి మరి...ఆవిడ మున్నెన్నడో ఇందిరాగాంధి గారింట్లో  ఒహానొహప్పుడు  ఒహ 'వంట మనిషి గా' అవతరించి ఆనక 'మహా మనీషి గా' ఎన్నబడి నేడు ఈ స్థాయి లో ఉండడానికి కారణం అయినారు-అని సెలవిచ్చాడట సదరు ఖాన్ గారు కార్యకర్థల సమావేశంలో ఎన్తో ఆవేశం గా. ఇది కాగానే మహా మంత్రి 'అశోక్ గెహ్లాట్' ఉక్కిరి బిక్కిరై -ఇది పొగడ్త కాదురా నాయనా..తెగడ్త అని చెప్పి ...పై నించి ...అదే...హై కమాండ్ నుంచి ఆదేశాలతో ....మంత్రి పదవి ఊడగొట్టాల్సి వచ్చింది....అర్ధమయిందా? అప్ప్పుడప్పుడు 'ఖాన్ తొ గేమ్స్ ఆడుకోవచ్చు మరి.