10, మార్చి 2011, గురువారం

'మార్చి ' నెల-బాలలు

ఏమిటేమిటి.....?
మార్చా.....?
లాంగ్ మార్చా....? లుంగీ  మార్చా....?
కాదు...ఖద్దరు 'కండూతి' మార్చా...?
ఓహొ...స్కూలు పరీక్షల 'మార్చా '?
మరి ఇది ...
పిలకాయల తలకాయలకి పరీక్షా?
కేంద్ర రాష్ట్రాల ప్రిస్టేజ్ పరీక్షా?
పాలక పక్షుల బ్యాటింగుల
ప్రతి పక్షుల బౌలింగుల మధ్య
పాపం....!
విధ్యార్ధులకు పరీక్షే పరీక్ష!!
పిల్లల ఉసురు పోసుకుంటున్న
ఖద్దర్ల కి
రేపో మాపో పడకపోతుందా
శిక్ష పై శిక్ష!!!

8, మార్చి 2011, మంగళవారం

no sparing rod

7, మార్చి 2011, సోమవారం

అల్లు వారి పెళ్ళి లోగిలి


అల్లు అరవింద్ గారి వద్ద నుంచి - బన్నీ పెళ్ళి శుభలేఖ వస్తే సరే కదా అని వెళ్ళాం. సాయంత్రం ఎనిమిది కి వెళ్తే పదకొండు కు బైట పడ్డాం. అయితే 'సినీమా పెళ్ళి ' కి వెళ్తే మనలాంటి లస్కుటపా గాళ్ళని 'త్రోసి ' రాజని 'వీ.వీ.వీ.ఐ.పీ.లకి  తప్పా సుఖమయమైన ఎన్ట్రీ ఉండదని మరో  मार् తెలిసొచ్చింది. హై 'టెక్కు ' సిటీ అంతా జజ్జనకరి జనారే జనసంద్రమైంది ఇలా.
ఎవడు వీపీ నో ఎవడు వీఐపీ నో మనకనవసరం గదా?ఎల్లామా-చూశామా. ఈయన అప్పటి కప్పుడు (అంటే నిన్న మద్యాహ్నం) ఓ కేరికేచర్ ప్రెసంట్ చేద్దామని గీసి ఆనక దాన్ని ఓ 'అయ్య ' చేతిలో పెట్టడానికి  విఫలయత్నం చేశారు. అది ఇలా ఉంది.

నేనే అది కాస్తా పగిలి ఊర్కుంటుందని ఓ రెండు మూడు రోజుల తర్వాత డైరెక్ట్ గా ఇంటికెళ్ళి బన్నీ కి ఇస్తామంటే 'అలాక్కానియ్' అన్నారు. ఈ సెక్యూరిటీ ఏ౦దో ఓ స్టేజ్ లో పబ్లిక్ ని పాసు గీసు లేపోయినా ఒదిలి పారేసారు ....పాసు గూల- అని కొంతమంది మొత్తుకుంటే చూశాను. దీని ప్రతాపం సహజంగానే భో'జన ' శాల మీద ఇలా పడింది.
ఈయనైతే ఇలా కుమ్మించుకుంటూ 'కుమ్మటం' మనవల్ల గాదు. పద బయటికొచ్చి ఏ చట్నీసో కాదంటే కేఫ్ నందినీ కో చలేంగే అన్నారు. మరి నేనుండ్లా-ససేమిరా అన్నాను.

5, మార్చి 2011, శనివారం

మా వాడికి ఏడో ఏడు.

అన్నట్టు మావాడికి నిన్నటికి సప్తవర్షాలు నిండాయి. అదే బాబూ...ఏడేళ్ళు నిండి ఎనిమిదో ఏట అడుగు పెట్టాడు. కొత్త బట్టలు వేసుకుని స్కూలు కి వెళ్ళడం రివాజే కదా....ఇదిగో ఇలా 'వర్ల్డ్ కప్ ' టీ షర్ట్ వేసుకుని స్కూలుకి పరుగు తీస్తే..అదుర్స్ అన్నారట వాడి ఫ్రెండ్స్.