యాత్రా దర్శిని లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
యాత్రా దర్శిని లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

5, మే 2018, శనివారం

4.05.2018  నుంచి    9.05.2018 వరకూ ...మనాలి (కులు జిల్లా, హిమాచల్ ప్రదేశ్) టూర్ లో నా ఎల్జీ సెల్ లో కాప్చర్ చేసిన కొన్ని ఫోటోలు....








































16, జూన్ 2014, సోమవారం

కాశీ పట్నం చూడర బాబూ....!

ఆ మధ్య అనుకోకుండా కాశీ పుణ్య క్షేత్రం దర్శించుకోగలగడం అదృష్టంగా భావిస్తున్నాను. అందునా,  సార్వత్రిక ఎన్నికల ఆఖరి ఘట్టం గా జరిగిన ( మోడీ వర్సెస్  కేజ్రీవాల్ -  నియోజక వర్గం అయిన )  వారణాసి లో ఎన్నికల రణరంగపు రోజు అయిన 13.05.2014 న అక్కడ ఉండటం అదో ఉత్కంట!   నిజానికి కాశీ వెళ్లేముందు ఎంతో తెలుసుకుని వెళ్ళాలనుకుని - 'భారతదేశ తీర్ధయాత్రలు' అనో 'దర్శనీయ  పుణ్యక్షేత్ర ములు' అనో ఉన్న చాలా పుస్తకాలు కొని చదివినవి కొద్దిగా సహాయపడగలిగినా, అనేకానేక వెబ్ సైట్లు మాత్రం ఆదరాబాదర అందించిన అసంపూర్తి తో కూడిన సమాచారమే ఉంది. స్వాతంత్ర్యానికి ముందెప్పుడో వ్రాసిన "ఏనుగు వీరాస్వామి" వారి కాశీ దర్శనం పుస్తకం pdf డవున్ లోడ్ చేసుకోగలిగినా, అందులోని  వందలాది పేజీల సమాచారం గ్రహించడం, అదీ శుద్ధ గ్రాంధికం లోనూ, అప్పటి కష్టతర  ప్రింటింగ్ లో ఉండటంతోనూ -  ఆ కొద్ది సమయం లో కుదరలేదు.అయితే తిరిగి వచ్చాక కూడలి లో చక్కటి బ్లాగ్ దొరికింది. అదే ఇది! కాశీ, దాని చుట్టు ముట్టు  దర్శనీయ స్థలాల గురించి అద్భుతమైన బ్లాగ్ ముంగిలి. బ్లాగరి లక్ష్మి గారికి వందనాలు. త్వరలో,  నా కెమెరా కన్ను తో చూసిన కొన్ని చిత్రాలని కూడా పోస్టు చేస్తాను. 

15, జనవరి 2012, ఆదివారం

మన్యంకొండ శ్రీ వేంకటేశ్వర స్వామి

నిన్న 14.01.2012 న మన్యంకొండ శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శన భాగ్యం కలిగింది. రాకాలోకం.బ్లాగ్‌స్పాట్   వారి సౌజన్యం తో...సదరు స్థల పురాణాన్ని ఇక్కడ సంగ్రహించాను! అలాగే కొన్ని నేను తీసిన స్నాప్స్ కూడా ఇక్కడ పొందు పరిచాను.
హైదరాబాద్ తిరిగి వచ్చేస్తూ దారిలో ఉన్న పిల్లల మర్రి కి వెళ్ళి ......