తెలుగు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
తెలుగు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

30, మే 2011, సోమవారం

ఇంద్రగంటి జానకీబాల గారి అద్భుత శైలిలో సాగిన ’కనిపించే గతం’

  • పాత పుస్తకాలూ, దినపత్రికలూ లాటివి కొన్ని పేపరువాడికి అమ్మేస్తుంటే - ఎప్పుడో ’వార్త’ డైలీలో సీరియల్ తాలూకు భద్రపరచబడ్డ క్లిప్పింగ్స్ బయట పడ్డాయి.
  • 28.8.2000(సోమవారం) ’వార్త" దినపత్రికలో మొదలైన ఆ డైలీ సీరియల్ (ఓ 42 రోజులు  వచ్చిందనుకుంటా-నాకు 42 క్లిప్పింగ్సే దొరికాయి.)  పేరు "కనిపించే గతం". రచయిత్రి - ఇంద్రగంటి జానకీబాల.
  • రచయిత్రి పరిచయంలో...ఆవిడ నాలుగు కధా సంపుటాలూ, తొమ్మిది నవలలూ, ఒక కవితాసంపుటీ వెలువరించారని ఉంది. వీటిల్లో ఏ ఒక్కటీ చదవకపోవడంచేత ఇదైనా చదువుదామని కూర్చున్నాం గత వారాంతపు ’తీరుబాటులో’.
  • ప్రధమ పురుషలో సాగే సీరియల్....జాతిపిత బాపూజీ మరణించిన రోజుకి మూడేళ్ళ వయసు చిన్నారి ’దేవకి’తన బాల్యం నేపద్యంతో రాసుకున్న నవల. తన బాల్యపు 'నిరుపేద బ్రాహ్మణ' జీవన విధాన రీతి....భీతి......ఇంకా ఆ రోజుల్లోని చిరు ఆనందాలూ, ఆడంబరాలూ, ఆర్భాటాలూ, అచ్చట్లూ, ముచ్చట్లూ, ఖేదన రోదనలూ...వగైరాలతో......సాదా సీదా శైలిగా కనిపిస్తూనే.....అనితరసాధ్యపు శైలిలో తీర్చిదిద్దారు రచయిత్రి. ప్రధమ పురుష వాడడం, వాస్తవికతా చిత్రీకరణ .... వీటితో ’ఆత్మకధేమో’ అనిపిస్తుంది. కావచ్చు-కాకపోవచ్చు. అయితే- ’ఆత్మకధ’ కాకపోయుంటే ఇంత గొప్పగా రాయలేరు సుమా -అనిపిస్తుందా కధాసరళి.  
  • అప్పట్లో...కాసిని కాఫీ నీళ్ళు పొయ్యిమీద ’పడేయడం’.....కుంపటి రాజేసి....పొగ గొట్టంతో ఊదటం....అరుగుమీద కూర్చుని పనీపాటా లేక కూని రాగాలు తీసే ఇర్రెస్పాంసిబుల్ తండ్రి.....నెలకి నలభై రూపాయల జీతంగల టీచరమ్మ.....పిల్లాజల్లా తో జట్కా బండిలో కాకరపర్రు ప్రయాణం.....ఇలా ఎన్నో ఈతరంవాళ్ళకి తెలీని ముచ్చట్లతో....అద్భుత శైలీ గమనంతో చదువరులనాకట్టుకుంటుందీ నవల. దీనికి తప్పకుండా పుస్తక రూపం వచ్చుంటుంది కాబట్టి.....దొరికితే తప్పకుండా పుస్తకప్రియులు చదవాల్సిన పుస్తకం!

18, మే 2011, బుధవారం

రంభాయూర్వశి లేదనబోకు.

నాయనా స్టీఫెన్ హాకిన్సూ..!
భూమి గుండ్రంగా ఉందనబోకు!!
రంభాయూర్వశి లేదనబోకు.
మరమనిషికీ-మనసుమనిషికీ
మీట నొక్కిన పిమ్మట చిమ్మచీకటేననబోకు.
వందల సిద్ధాంతుల మధ్య కొత్త సిద్ధాంతమిదియేయని
రాధ్ధాంతం చేయకు..!!
మాకు కో అంటే కోటి దేవుళ్ళున్నారు.
వందల కోట్ల సెంటిమెంట్లను
లక్షల కోట్ల వాణిజ్యాల్ని
చల్లగా కాపాడే భావోద్వేగాలనూ
చిల్లర అంశాలతో
చల్లటి వ్యవస్థని చిలకబోకు....!!
 మాకు తెలిదన్నట్టు
కొత్తగా చార్వాకపర్వం విప్పబోకు !!


24, ఏప్రిల్ 2011, ఆదివారం

ప్రేమస్వరూపుడు శ్రీసత్యసాయి మహాభినిష్క్రమణం!



కొద్దిగా తడపమని కరువుపీడిత సామాన్యుల గొంతుకలడిగితే
సుజల స్రవంతులనిచ్చావ్!
శాంతీ-వాత్సల్యాలు కొరవడి కరువాచిన తరుణంలో-
ప్రేమాంమృతం పంచకుండా అలా ఎలా ఎగిరిపోయావ్ శాంతి కపోతమా?

23, ఏప్రిల్ 2011, శనివారం

ఎవడు యాగం చేస్తే దిమ్మదిరిగి మైండ్ బ్లాకై చీలిపోద్దో......

ఎట్టకేలకు తెబ్రాలు పరమ సక్సెస్ ఫుల్ గా వేర్పాటై మే 1 న 'తెలంగాణా అర్చక,బ్రాహ్మణ శంఖారావం' చేస్తునారట. శుభంభూయాత్! బ్యానర్ పేరు:తెలంగాణా బ్రాహ్మణ ఐక్య కార్తాచరణ సమితి. ప్రదేశం: దోమలగూడా లోని ఏ.వీ.కాలేజ్ మైదానం. సమయం: సా.4 గం; సభాప్రముఖులు:కేసీయారు,కిషన్ రెడ్డి (ఊహించినట్టే.... షరా మామూలే)(కోదండరాం - గద్దరు బాచుంటుందో- సంఘపరివారముంటుందో అప్పుడే తెలీదు-మనకి! ఇవి మున్ముందు వేరే ’పరిణయాలకు’ (పరిణామాలకి కాదు) దారితీయచ్చు-పాపం మంత్రి శ్రీధర బాబు ని పిలిచుంటే, ఏం మాట్టాడమని అడుగుతారో చూడాలి) అదలా వుంచి-నాకు తెలిసి ’బ్రాహ్మణ సేవాసంఘ సమాఖ్య (ఈస్ట్ జోన్) (మిగతా జోన్ల సంగతి తెలీదు) అని ఆనందబాఘ్,ఖైరతాబాద్ లోనూ, మరో ఆఫీసు శాతవాహన నగర్, వనస్థలిపురం లోనూ ఉంది. ఈ కొత్త సమాఖ్యకీ పాత సమఖ్యకీ కోర్డినేషన్ ఉందో లేదో మనకనవసరం.
అయితే ఒక విషయం నన్ను బాగా కదిలించింది. ఎవడు యాగం చేస్తే దిమ్మదిరిగి మైండ్ బ్లాకై చీలిపోద్దో ఆడి చేత చీల్పించుకున్నది - ఆ యాగం చేసిన బుధజనమే అయుండడం. కన్ఫ్యూసింగా ఉందా! పర్లేదు. వదిలేద్దాం. అసలింత వీజీగా .....సునాయాసంగా....సంఘటితం కావలసిన తరుణంలో..... ఒక ’కులం’ ప్రాంతీయంగా చీలికకి గురి కావడం బహుశా 'ప్రపంచ కులాల్లోనే' సంచలనం కలిగించేదే. గిన్నీసు తరహా గిన్నెలో ఒదగదగ్గదే. ఏదేమైనా ’సర్వేజనా సుఖినోభవంతు’ అనేది మా లక్ష్యం గా ...... ఒకటి చెప్పాలనుంది. అదేంటంటే - "పదవులు మాకు - సామూహిక ఉపనయనాలు,పెళ్ళిళ్ళూ మీకు" అనే ఎజెండా నించి సమాఖ్య పెద్దలు దూరంగా ఉండాలి. ఈరోజు నుంచి 100 రోజుల తర్వాత సగటు 'పేద బ్రాహ్మణుడి' కి ఏమాత్రం సేవ చెస్తారో చేయిస్తారో చూసి బ్లాగుతాను.బాయ్!

17, ఏప్రిల్ 2011, ఆదివారం

"తెబ్రా" లకన్నా "ఆంబ్రా"లకు "ఆ-డంబరం" ఎక్కువ.

ఆంబ్రా (ఆంధ్రా బ్రాహ్మణులు) లకు "ఆడంబరము" జాస్తి. తెబ్రా(తెలంగాణా బ్రాహ్మణులు)లకు ఈ తీట లేదు అని లేటెస్టుగా శతచండీయాగకర్త యాగం లో భాగంగా _ వాక్రుచ్చారు అనేకంటే ఉద్బోధించారు అంటే బావుంటుంది! ఆహా! ఏమి యాగఫలము? అసలే బ్రాహ్మణ జాతి ఇంటి పోరుతో,ఆకలి పోరుతో చిక్కి శల్యమవుతుంటే ఇది మరో చీలికాస్త్రం కాదా అంటున్నారు బుద్దిజీవులు. అయినా ఆయన చేస్తే "యాగం" గానీ "ఆగం" గానీ ఏదో ఒహటి ఔతుంది అనేది ప్రాచుర్యమే కదా! అదటు వుంచి...గుక్కెడు మంచినీళ్ళ కోసం ప్రాంత జనాలు జీవితాల్లో ఉగాదులు లేక గోలెడుతుంటే చేయూతకు బదులు యాగాదులు చేయ కడుంగడు శోచనీయము కాదాయనిన్నీ, ఇయ్యట్టిది " ఆడంబరమో " ఏ "డంబరమో" యని ఆక్రోశించుట వీరి శ్రవణములకు సోకలేదాయని ప్రజలు పరిపరి విధముల భావించుచున్నారు.
రెండు. బ్రాహ్మణుల మీద అంత వాత్సల్యము కలిగినయడల_ తాను "నిమిషం" కూలీ చేసి "లక్ష", గంట పనిచేసి "కోటి" పుచ్చుకున్నట్టు, సదరు బ్రాహ్మణుడు "నమకం" చెప్పి లక్షా "చమకం" చెప్పి రెండు లక్షలు అడిగితే వారు సమర్పించుకోడానికి రెడీయా? లేక మరో వేర్పాటుకు ఏర్పాటు చేస్తారా?

15, ఏప్రిల్ 2011, శుక్రవారం

ఏ కర్తవ్యం - ఏ బాధ్యతా లేకుండా నెలకు లక్ష పైచిలుకు జీతం (ఇహ బ్లాక్ లో చెప్పలేనన్ని కోట్లు......)

అంత ఆశ్చర్య పడకండేం...నేటి ’టైమ్స్ ఆఫ్ ఇండియా 9 వ పేజీలోని ఓ వార్త సభ్య సమాజం ఆర్ధిక వ్యవస్త సిగ్గుపడేలా చేస్తుంది. మనం ఏరి కోరి ఎన్నుకునే ప్రజా నాయకుల కి - అసలు పనేంటి...పాటేంటి...గీతమొదిలేసి జీతమెంత ...? లాటి వివేకవంతమైన ప్రశ్నలే ఓ క్రియాశీల వ్యక్తి ఐన దేబషీస్ భట్టాచార్య కి కలగడం, ఆ వెంటనే 'ఆర్టీఐ' పుణ్యమా అని.... ఎలక్షన్ కమీషన్ కు మొరపెడితే అది ఎలా ప్రయాణించి చివరికి ఎక్కడెక్కడికో తిరిగి...చివరికి.... అసలు ఎమ్పీ , ఎమ్మెల్యే లకు "న కర్తవ్యం-న బాధ్యత" అని తేల్చి చెప్పారుట ... ప్రభుత్వం వారు... అదేదో "న భయం-న లజ్జ" అనేది స్పురించేట్టు. పూర్తి సమాధానపు ’బంతి’ ఇంకా న్యాయ మంత్రిత్వ శాఖ 'కోర్టు' లో ఉందట. సదరు వార్త టెక్స్ట్ ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను.
NEW DELHI: What are the duties and responsibilities of members of Parliament and state legislative assemblies? Actually nothing!

A series of RTI queries filed with the central government and state assemblies show that there are no duties and responsibilities for elected representatives of the people. The only exception may be Sikkim, where the assembly has rules of procedure "specifying the duties (and) responsibilities of MLAs towards the august House being public representatives" and it would be their "prime duty to maintain communal harmony and peace among the people".

On February 2, 2009, an RTI application was filed by activist Dev Ashish Bhattacharya with the Election Commission seeking details of duties, responsibilities and accountability of MPs and MLAs. The commission replied that it was "not concerned with information sought" and it had no such information. On an appeal, the commission's appellate authority ruled that the query should have been transferred to the ministry of parliamentary affairs and ministry of law and justice.

Lok Sabha secretariat said on June 3, 2009 that there was "no provision either in the Constitution or the Rules of Procedure and Conduct of Business in Lok Sabha defining duties and responsibilities of members of Parliament or through which the accountability can be fixed on non-performing MPs".

The Lok Sabha secretariat quoted Article 99 of the Constitution, to say that the members have to "make and subscribe before the President or some person appointed in that behalf by him, an oath or affirmation according to the form set out for the purpose in the Third Schedule". The person appointed by the President is the protem speaker, who takes oath from the President in Rashtrapati Bhavan. Protem speaker also signs the roll of members in the House.

The Bihar assembly also believes that "there is no provision/rule through which the duties, responsibilities and accountabilities of MLAs are fixed". And there was "no provision in the law through which accountability can be fixed" on non-performing MLAs, it said. West Bengal assembly's public information officer said they too didn't have any specific rules "through which the responsibility and accountability can be fixed".

The Haryana Vidhan Sabha secretariat said while there were no specific acts defining the duties of MLAs, the "members are bound to bear the true faith and allegiance to the Constitution of India as law established, that he will uphold the sovereignty and integrity of India as per provisions of the Constitution of India".

The Assam assembly does not have specific rules. It said, "As per parliamentary practice and convention, the members are bound to maintain the highest tradition in parliamentary life and they are responsible to observe good conduct both inside and outside the House as well."

The story isn't much different in the responses from most other state assemblies. Kerala assembly said "no specific statute has so far been enacted by the Kerala legislative assembly".

However, in Sikkim, elected representatives have rules of procedure and conduct of business provisions "specifying the duties and responsibilities of MLAs towards the august House being public representatives", the RTI reply said. Sikkim provision says, "It will be their prime duty to maintain communal harmony and peace among the people of their respective constituencies."

The President's secretariat, after remaining silent for almost six months, referred the RTI application to the ministries of law and justice and parliamentary affairs recently. On February 18, the ministry of law and justice referred the matter to parliamentary affairs, which is yet to reply to the RTI.

కొద్దిగా ఆలోచిస్తే - అన్నాహజారే పోరాటక్రమం లో అసలు ముందు ఈ గొళ్ళెం సంగతి కీలకంగా కనిపించడంలా?

4, ఏప్రిల్ 2011, సోమవారం

'ఖరము' కాదా 'శ్రీకరము' ?

ఉగాది అంటే
ఎందుకో నాకు
వ్యక్తిత్వ వికాస గ్రంధంలో
తొట్టతొలి అధ్యాయంలా
హృద్యంగా అనిపిస్తుంది!
ఎందుకంటే అది-
ఎండిన గుండెల మోళ్ళు
మళ్ళీ తడి చిగుళ్ళు
పెడతాయని చెప్తుంది!!
బ్రద్దలైన అనుబంధాల బీళ్ళు
సారవంతమైన లోగిళ్ళవుతాయని
తెలుపుతుంది!!!
కొన్నాళ్ళపాటు తాళాలు వేస్కున్న
ఎల కోయిల గళాలు-
మళ్ళీ యుగళ గీతాలై గుబాళిస్తాయని
చాటుతుంది!
శిశిరంతో సమరం
వసంతంతో సరసం
కోసమేనని తేట పరుస్తుంది!!
షడ్రుచులతో జీవనం
షడ్రసోపేత భోజనమే అంటుంది!!!
కోకిల ఉత్తేజ గీతాలు విన్న పశుర్వేత్తి'
'ఖరము'  సైతము
కాదా  'శ్రీకరము'  అంటుంది!

27, మార్చి 2011, ఆదివారం

నేడు పాటల తోట-పుస్తకావిష్కరణ

శ్రీ వయ్యా సామేల్ గారి 'పాటల తోట ' పుస్తకావిష్కరణం కుత్బుల్లాపుర్ లోని నాగార్జున హై స్కూల్ లో ఉ.11-00 గం.కు జరగనుంది. శ్రీ సామేల్ గత పది సం.గా సిటీ అరసం సభ్యుడు గా ఉన్నారు. ఇప్పటికే పదిహేను కవితా సంపుటులను వెలికి తెచ్చారు. పేద ప్రజల పక్షపాతిగా సామజిక కార్యకర్తగా ఆయన తన పుస్తక రచన చేయటం అంతా తెలిసిందే. పెద్దగా చదువుకోలేదు గానీ సమాజాన్ని బాగా చదివారు. ఎటూ ప్రీ లాంసింగ్ గాబట్టి దేనికీ వెరవాల్సిన పనిలేక సమాజంలోని కుళ్ళుని తన కలంతో బలంగా కుళ్ళబొడిచారనేది కొన్ని పుస్తకాలు చదివిన నాకు కూడా అర్ధమయింది. దాదాపు ఆయన అన్ని పుస్తకాలకీ ముఖపత్రం వేసిన వర్చూ దీనికి కూడా  పై విధంగా ముఖపత్రం సామేల్ కి గీసిచ్చారు. ఇంటిల్లిపాదీ జ్వరాలు కాబట్టి పిలుపు వచ్చినా హాజరవలేక పోతున్నాం. ఆల్ ది బెస్ట్ సామేల్జీ!!!

24, మార్చి 2011, గురువారం

ఇదో పెట్టీ ధంధా.....

కారేసుకుని అలా ఓ పుచ్చకాయల ముందు ఆగారనుకోండి.వాడి దగ్గర చాలా చచ్చు పుచ్చువి కొన్ని కుప్ప పెట్టుకుంటాడు. అవి ఓ రెండు మూడు మీ టైర్ల కింద పడేసి నువ్వే పగలకొట్టావ్.పైసలివ్వు అని యాగీ చేస్తాడు.ఇది ఆమధ్య విన్నాను. ఇవ్వాళ నాకే ఓ రైతు బజార్ ముందు గేటు కు అడ్డంగా పెట్టుకుని ద్రాక్షపళ్ళు కొందామని అలా ఆగేనో లేదొ  .... ఏమ్మోవ్ .. కారు దిగి చూడు ఎన్ని కాయలు పగలగొట్టావో.....అంటూ చొక్కా మడిచాడు ఇలా....
...వాళ్ళవాళ్ళే చుట్టూతా పోగవుతారు...ఇలా దారిలో ఎందుకు పెట్టారు ....ట్రాపిక్ పోలీస్ పెర్మిషన్ ఉందా లాంటి మన పుచ్చు ప్రశ్నలు అక్కడ వినేవారు ఎవ్వరూ ఉండరు.  చచ్చినట్టు ఓ రెండొందలు వదిలించుకుని ఆనక  సెల్ లో క్లిక్ చేస్తోంటే రోడ్డు మీద పెట్టిన కాయలని చకచకా ముందుకు తోస్తున్నాడు...ఇలా...
ప్చ్......!!!

20, మార్చి 2011, ఆదివారం

చందమామ పై కవులు ప్రేమ-సునామీ తో రెచ్చిపోవచ్చు

చందమామ ఎప్పటికీ మామే.
బుల్లి తెరలో-  అశాస్త్రీయ పిల్లులో  భయపెట్టిన 'సూపరు' కాదు గాక కాదు.
కవి కోటికి అతగాడు ఎప్పుడూ 'సూపరే'!
ప్రాణికోటికి చల్లటి కాంతి చుక్కాని చూపరే!!
కురిపిస్తే 'చల్లని' తెల్లని 'లావా' నే-
 నాయకుడనీ అనామికుడనీ తేడా లేక
మన మీద విరుచుకు పడే సుఖమయ  స్నిగ్ధ  'సునామీయే'!
చిరు అలల కామనలు రేపుతాడే గానీ
ధరణీకంపాల దరికి  ఛస్తే  రాడు రాడు
చచ్చు   జోస్యాలని అపహాస్యం చేస్తాడే గాని
దారుణ మారణ హోమం చేతగానే కాదు
పిచ్చి 'మచ్చ' లేని మామగానే జగమేలుతాడు.

(నిన్న (  19-3-2011 )  అందరూ ఊదరగొట్టినట్టు "సూపర్ మూన్" అపకారం చేయలేదు. మరింత అందం గా కనిపించాడు.గత వంద ఏళ్ళ సమాచారాన్ని పరిశీలించినా "సూపర్ మూన్" కీ "ప్రకృతి విపత్తు" కూ సంబంధం  లేదని డిల్లీ  నెహౄ ప్లానటోరియం డైరెక్టర్ ఎన్.రత్నశ్రీ చెప్పారు. భూకంపాలు సునామీ లు భూ అంతర్గత విషయాలని చంద్రుడిని లాగడం పద్దతి కాదని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రొఫిసిక్స్ మాజీ ప్రొ.ఆర్.సీ.కపూర్ కూడా చెప్పారు. ఎటొచ్చీ అసలు విషయం "మన చందమామ" ప్రూవ్ చేశాడు. ఆవిధంగా "జ్యోతిష వేత్త" రిచర్డ్ నోలె ఓడిపోయాడు.)




18, మార్చి 2011, శుక్రవారం

.. ... పాప అయితే 'స్విని', బాబయితే 'స్వి' ... ...

    పిల్లలు పుట్టగానే తలిదండ్రులు- ఏ పేరు పెట్టాలనే 'సంబరం' తో కూడిన 'మీనమేషాల్లో'  పడ్తారు.  'నక్షత్ర' యాత్రలు చేస్తారు. 'కుజ' దోషాలన్నా 'భుజ' దోషాలన్నా ఏమైనా ఉన్నాయేమో అని చూస్తారు.మంచి 'పంచాంగానికి' ఓ సలాం పెడ్తారు. ఏ యండకా పేరు చెప్పే యండమూరి వారి పొత్తమో, మల్లా మల్లా చూసి దాచుకునే మల్లాది వారి బుక్కో పట్టుకుని మల్లగుల్లాలు పడ్తుంటారు. అన్నట్టు-వర్చూ కూడా ఓ సారి చేయి చేస్కుని 'నేమ్ యువర్ బేబి '-చిన్నారుల పేర్ల పుస్తకం ' ఓ బుక్కు రాసి 'పారేశాట్ట'. (ప్రింట్ చేసి 'పారేసిన'వారు : కవర్ డిజైనర్ ( శ్రీ  రామకృష్ణ కోట్ల) స్వయంగా పూనుకుని వారి తాలూకు ముద్రికా కమ్యూనికేషన్స్, 8-2-293/D/16, Jawahar Colony, Indira Nagar, Jubiliee Hills X Roads, Hyderabad-500 044 వద్ద పబ్లిష్ అయిన జులై, 95 ప్రతి) (కొన్నోడు, ప్రింట్ చేసినోడు, చదివినోడు ఒక్కడూ  లేడు గాబట్టి డీటైల్స్ నేను కూడా ఇచ్చి'పారేశాను'.)  
    సారీ......అసలు విషయమేంటంటే,  పైన చెప్పిన 'మీమాంస ' లో పేరెంట్స్ నవ్యాతి నవ్య  నామాల్ని శోధించి, ఒడిసి పట్టి ఒకింత 'మోడరన్ నేమ్స్'  పెట్టడం పరిపాటయింది. ఇంతవరకూ శభాష్!! తప్పే లేదు. అయితే తపస్వి, యశస్వి, ఉషస్వి, తేజస్వి లాంటి (చివర 'స్వి' వచ్చే ) పేర్ల దగ్గర చిరు జాగ్రత్త తీసుకోమని మనవి. ఉదాహరణకు, అబ్బయి కి 'యశస్వి' అన్నపేరు పెడితే,  అమ్మాయి కి 'యశస్విని' అని పెట్టాలి. అంటే చివర 'స్విని'  చేరుతుంది. 'తపస్సు ను ఆచరించే వాడు తపస్వి'  అయితే, ఆచరించే వనిత 'తపస్విని' అవుతుంది.     సో, అమ్మాయిల పేర్లు....తపస్విని, యశస్విని,ఉషస్విని,తేజస్విని, వర్చస్విని .....ఇలా అవుతాయి. అంతేకాని బావున్నాయి కదా అని ఎడాపెడా  'అమ్మాయిలకి'  తేజస్వి అనీ యశస్వి అనీ పెట్టకండేం..! ప్లీజ్....!  (బ్లాగ్స్ రీచ్ కొంత వరకు వర్కవుట్ అవుతుందని-రీచ్ అయినవారు మరికొందరి కి రీచ్ చేస్తారని ఆశిస్తూ...)
(కాదు..పెట్టచ్చు అనే భాషాశాస్త్రవేత్తలు దయచేసి ఇక్కడ మెయిల్ చెయ్యండేం)

16, మార్చి 2011, బుధవారం

సరదాగా బోటింగు సేసేసి ఆనక దూకి సస్తాననో కూస్తే ఐ.పీ.సీ. 309 లు ఆకర్షించబడవా?

ఆక్టివ్ యుథనేసియా (మెర్సీ కిల్లింగ్ అనబడే బలవన్మరణం) 'తప్పు' గానీ, పాసివ్ యుథనేసియా (చంపీ చంపనట్లున్న లేదా చచ్చీ చావనట్టున్న విధంగా ఆత్మహత్య) 'పర్లేదు' అని తేల్చి పారేసింది  సుప్రీం కోర్ట్ ''అరుణా శాన్బాగ్ కేస్'' లో్! ఇది కొందరికి  'శుభం' మరికొందరికి  'భశుం'. తీర్పులు చంపీ చంపనట్టు ఇవ్వటం మహారాజశ్రీ కోర్టు వారికి షరా మామూలే! కానీ ఈ కేసు లో సుప్రీం చాలా సమర్ధవంతమైన తీర్పే ఇచ్చింది. ఏ కోమా దశలో వారికి ఇది 'వరమే'. ఎంచేతంటే కాటికి పర్మిషన్ బంధువులు (?) అడుగుతారు. (వ్యక్తి అడగలేడు గాబట్టి) . కోర్టు 'పరిశీలిస్తుంది' ఫేవరబుల్ గా. లైఫ్ బోర్ దొబ్బో , బతకలేని (ఆర్ధిక) స్తోమత తోనో వ్యక్తే  'ఇంకోటో మరొహటో' కారణం చేత అడుగుతే నో అంటుంది చట్టం. ఎందుకు? ఐ.పీ.సీ. 306(ఆత్మహత్య కు ప్రేరేపణ) మరియు 309(ఆత్మహత్య చర్య)   ప్రకారం 'చస్తాను బాబోయ్' అంటె నేరం. ఆణ్ణి శుభ్రంగా బొక్కలో ఏసేయొచ్చు. పైన చెప్పిన తీర్పు తో 'మరింత', 'వ్యక్తిగత', 'జటిల' 'మరణ కారణాలుంటే' తప్ప చావుకు 'క్లీన్ చిట్' ఇవ్వదు చట్టం. మనలో మాట-ఉద్యమాల పేర్లు చెప్పి కొందరు నాయకమ్మన్యులు ఫొటొ కోసం కిరసిన్ సీసా గుమ్మరించుకుంటున్నట్టో ట్యాంకు బండ లో కాసేపు సరదాగా బోటింగు  సేసేసి ఆనక దూకి సస్తాననో కూస్తే ఐ.పీ.సీ. 309 లు ఆకర్షించబడవా?

15, మార్చి 2011, మంగళవారం

మన 'జీవితానికి' కోటి దండాలు

 ఇక్కడ నొక్కి  చూసి....ఓ క్షణం వీక్షణం తో రిలాక్స్ అవచ్చేమో?(నిర్మాత సౌజన్యంతో..)

ఏమి రైట్రో.....యాడి రైట్రో....!!!

పొరపాట్న
ఓ ఓటరు గుడిశ తలుపు
తట్టిన ఓ రాజకీయమ్మన్యుణ్ణి_
తలుపు తీసి ఏమడుగుతాడు?
కూడా?గూడా?గుడ్డా?
ఆ వచ్చిన వాడెవడో ముందు తెలియాలిగా!
"నువ్వు ఏ పార్టీ ?
ఏ స్టేట్ ?
అసెంబ్లా?
పార్లమెంటా ?
కార్పొరేటరా?జడ్పీయా?
గల్లీయా?
ఆంధ్రానా?
తెలంగాణా?
నార్త్ ఆంధ్రానా_సౌథ్ ఆంధ్రానా?
ఈస్ట్ తెలంగాణా_వెస్ట్ తెలంగాణా?
ఆంధ్రాలో అప్పోజీషనా_తెలంగాణా అప్పోజీషనా?
ఆంధ్రా రెబలా_తెలంగాణా రెబలా?
సెట్లర్ బాబువా?
తెలంగాణా సపోర్టింగ్ సెట్లరా_ఆంధ్రా సపోర్టింగ్ సెట్లరా?
లైఫ్ లో సెటిల్ అయిన సెట్లరా?
లైఫ్ లేని సెటిల్ కాని సెట్లరా?
సమైక్యమా అసమైక్యమా?
రీజనల్ కొత్త పార్టీయా?
నాన్ రీజనల్ పాత పార్టీయా?
అండర్ మెర్జరా?
వుడ్ బీ మెర్జరా?
పోయినోడి తాలూకు బతికున్న జండానా?
పోయినోడితోనే పోయిన జండానా?
పోకముందు సీక్రెట్ అజండానా?
పోయింతర్వాత ఓపెన్ జండానా?
ఓపెన్ 'సీక్రెటా?'
సీక్రెట్ 'ఓపెనా?'
ఏ పార్టీ జాకు?
ఏ జాకు చాకు?
........      .....    ......
.....        ......    .....
(అన్నట్టు ముగింపు: నిన్న బండు మీద సరికొత్తగా "రైటర్లు"
ప్రతిఘటించారుట. పైన చెప్పిన సాధారణ ఓటరు....సారీ! 'సాధారణ' చదువరి దగ్గరి కి ఓ
'రైటరు' వెళితే సదరు చదువరి పై ప్రశ్నాస్త్రం సంధించక తప్పదు.కంటెంట్ సంగతి తర్వాత.)

10, మార్చి 2011, గురువారం

'మార్చి ' నెల-బాలలు

ఏమిటేమిటి.....?
మార్చా.....?
లాంగ్ మార్చా....? లుంగీ  మార్చా....?
కాదు...ఖద్దరు 'కండూతి' మార్చా...?
ఓహొ...స్కూలు పరీక్షల 'మార్చా '?
మరి ఇది ...
పిలకాయల తలకాయలకి పరీక్షా?
కేంద్ర రాష్ట్రాల ప్రిస్టేజ్ పరీక్షా?
పాలక పక్షుల బ్యాటింగుల
ప్రతి పక్షుల బౌలింగుల మధ్య
పాపం....!
విధ్యార్ధులకు పరీక్షే పరీక్ష!!
పిల్లల ఉసురు పోసుకుంటున్న
ఖద్దర్ల కి
రేపో మాపో పడకపోతుందా
శిక్ష పై శిక్ష!!!

7, మార్చి 2011, సోమవారం

అల్లు వారి పెళ్ళి లోగిలి


అల్లు అరవింద్ గారి వద్ద నుంచి - బన్నీ పెళ్ళి శుభలేఖ వస్తే సరే కదా అని వెళ్ళాం. సాయంత్రం ఎనిమిది కి వెళ్తే పదకొండు కు బైట పడ్డాం. అయితే 'సినీమా పెళ్ళి ' కి వెళ్తే మనలాంటి లస్కుటపా గాళ్ళని 'త్రోసి ' రాజని 'వీ.వీ.వీ.ఐ.పీ.లకి  తప్పా సుఖమయమైన ఎన్ట్రీ ఉండదని మరో  मार् తెలిసొచ్చింది. హై 'టెక్కు ' సిటీ అంతా జజ్జనకరి జనారే జనసంద్రమైంది ఇలా.
ఎవడు వీపీ నో ఎవడు వీఐపీ నో మనకనవసరం గదా?ఎల్లామా-చూశామా. ఈయన అప్పటి కప్పుడు (అంటే నిన్న మద్యాహ్నం) ఓ కేరికేచర్ ప్రెసంట్ చేద్దామని గీసి ఆనక దాన్ని ఓ 'అయ్య ' చేతిలో పెట్టడానికి  విఫలయత్నం చేశారు. అది ఇలా ఉంది.

నేనే అది కాస్తా పగిలి ఊర్కుంటుందని ఓ రెండు మూడు రోజుల తర్వాత డైరెక్ట్ గా ఇంటికెళ్ళి బన్నీ కి ఇస్తామంటే 'అలాక్కానియ్' అన్నారు. ఈ సెక్యూరిటీ ఏ౦దో ఓ స్టేజ్ లో పబ్లిక్ ని పాసు గీసు లేపోయినా ఒదిలి పారేసారు ....పాసు గూల- అని కొంతమంది మొత్తుకుంటే చూశాను. దీని ప్రతాపం సహజంగానే భో'జన ' శాల మీద ఇలా పడింది.
ఈయనైతే ఇలా కుమ్మించుకుంటూ 'కుమ్మటం' మనవల్ల గాదు. పద బయటికొచ్చి ఏ చట్నీసో కాదంటే కేఫ్ నందినీ కో చలేంగే అన్నారు. మరి నేనుండ్లా-ససేమిరా అన్నాను.